1982
Jump to navigation
Jump to search
1982 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1979 - 1980 - 1981 - 1982 - 1983 - 1984 - 1985 |
దశాబ్దాలు: | 1960లు - 1970లు - 1980లు - 1990లు - 2000లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఫిబ్రవరి 24: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా భవనం వెంకట్రామ్ పదవిని చేపట్టాడు.
- మార్చి 29: తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించాడు.
- జూన్ 13: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు స్పెయిన్లో ప్రారంభమయ్యాయి.
- జూలై 25: భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవిని చేపట్టినాడు.
- నవంబర్ 19: 9వ ఆసియా క్రీడలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి.
జననాలు
[మార్చు]- జనవరి 1: ఐశ్వర్య ధనుష్, భారతీయ సినీ దర్శకురాలు, భారతీయ నటుడు రజినీకాంత్ పెద్ద కుమార్తె.
- ఫిబ్రవరి 23: కరణ్ సింగ్ గ్రోవర్, భారతీయ టెలివిజన్ నటుడు, మోడల్.
- జూన్ 30: అల్లరి నరేష్, సినిమా నటుడు, తెలుగు సినిమా దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ ద్వితీయ కుమారుడు.
- జూలై 12: ఆచంట శరత్ కమల్ , టేబుల్ టెన్నిస్ ఆటగాడు.
- ఆగష్టు 5: జెనీలియా, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ సినిమా నటి.
- నవంబర్ 27: హన్ మెనీ, కంబోడియా దేశపు ఉప ప్రధానమంత్రి, పద్మశ్రీ పురస్కారగ్రహీత.
- డిసెంబరు 4 : ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రేరణ కలిగించే వక్త, క్రైస్తవ మత ప్రచారకుడు నిక్ వుజిసిక్.
మరణాలు
[మార్చు]- జనవరి 2: డేవిడ్ అబ్రహం, హిందీ సినిమా నటుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1909)
- జనవరి 18: హువాంగ్ గ్జియాన్ హన్, చైనాకు చెందిన విద్యావేత్త, చరిత్రకారుడు. (జ.1899)
- మార్చి 10: జి.ఎస్.మేల్కోటే, స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు. (జ.1901)
- మార్చి 19: జె.బి.కృపలానీ, భారతీయ రాజకీయ నాయకుడు. (జ.1888)
- జూలై 2: చెరబండరాజు, విప్లవ కవి. (జ.1944)
- అక్టోబర్ 2: సి.డి.దేశ్ముఖ్, భారత ఆర్థికవేత్త, దుర్గాబాయి దేశ్ముఖ్ భర్త. (జ.1896)
- అక్టోబర్ 10: సుద్దాల హనుమంతు, జానపద కళాకారుడు, తెలంగాణ విమోచనోద్యమకారుడు, తెలుగు సినిమా పాటల రచయిత, గాయకుడు.
- అక్టోబర్ 14: సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, తెలుగు పండిత కవులు. (జ.1897)
- అక్టోబర్ 15: నిడుదవోలు వేంకటరావు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1903)
- నవంబరు 15: వినోబా భావే, స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. (జ.1895)
- నవంబరు 18: పురిపండా అప్పలస్వామి, బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయుడు. (జ.1904)