iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: https://te.wikipedia.org/wiki/విశ్వభారతి_విశ్వవిద్యాలయం
విశ్వభారతి విశ్వవిద్యాలయం - వికీపీడియా Jump to content

విశ్వభారతి విశ్వవిద్యాలయం

అక్షాంశ రేఖాంశాలు: 23°40′44″N 87°40′25″E / 23.67889°N 87.67361°E / 23.67889; 87.67361
వికీపీడియా నుండి
విశ్వభారతి విశ్వవిద్యాలయం
నినాదంయత్ర విశ్వం భవత్యేకానిదమ్(సంస్కృతభాష)
ఆంగ్లంలో నినాదం
Where the world makes a home in a single nest
రకంసార్వజనిక
స్థాపితం1921 డిసెంబరు 23; 102 సంవత్సరాల క్రితం (23-12-1921)
వ్యవస్థాపకుడురవీంద్రనాథ టాగూరు
ఛాన్సలర్భారత ప్రధానమంత్రి
వైస్ ఛాన్సలర్ఆచార్య బిద్యుత్ చక్రబర్తి[1]
విద్యార్థులు5,631[2]
అండర్ గ్రాడ్యుయేట్లు2,755[2]
పోస్టు గ్రాడ్యుయేట్లు1,818[2]
స్థానంశాంతినికేతన్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
23°40′44″N 87°40′25″E / 23.67889°N 87.67361°E / 23.67889; 87.67361
కాంపస్గ్రామీణ
అనుబంధాలుయు.జి.సి, ఎన్.ఎ.ఎ.సి, ఎ.ఐ.యు, ఎ.సి.యు[3]

విశ్వభారతి విశ్వవిద్యాలయం ఒక సార్వత్రిక కేంద్ర విశ్వవిద్యాలయం, జాతీయ ప్రాముఖ్యత కలిగిన విద్యాసంస్థ. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాంతినికేతన్‌లో నెలకొని ఉంది. రవీంద్రనాథ్ టాగూరు ఈ సంస్థను నెలకొల్పాడు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు ఇది ఒక కళాశాలగా ఉండేది. 1951లో ఈ సంస్థకు విశ్వవిద్యాలయ స్థాయిని కల్పించి విశ్వభారతి విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు.

అవలోకనం

[మార్చు]

"శాంతి నికేతన్ దేశంలోని మిగతా విశ్వవిద్యాలయాలకంటే ఎన్నో విధాలుగా విభిన్నమైనది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బిర్భమ్‌ జిల్లా బోల్‌పూర్‌లో నెలకొని ఉన్న ఈ విశ్వవిద్యాలయం నేటికి కూడా టాగూర్ కలలను సాకారం చేసేవిధంగా గ్రామీణ విద్యార్థులను చేర్చుకుంటున్నది. తరగతులు ఇప్పటికి కూడా బయలు ప్రదేశంలో పెద్ద పెద్ద మామిడి చెట్ల క్రింద జరుగుతున్నాయి. పర్వావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు సైకిళ్లపై ప్రయాణిస్తారు. పాతభవనాలు మట్టిగోడలతో, గడ్డి కప్పులతో ఉన్నప్పటికీ నేటికీ దృఢంగా ప్రధాన క్యాంపస్‌లో ఉన్నాయి. వాటిలో కొన్ని చరిత్రలో భాగంగా పరిరక్షించినా మరికొన్ని అన్ని విధాలా ఉపయోగంలో ఉన్నాయి. కొంత మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని వినోదార్థం సందర్శించినా, విద్యాభిమానులు ఇక్కడ జ్ఞానసంబంధమైన అనుభూతులు, స్పందనలు పొందుతారు. ఎక్కువ మంది ముఖ్యంగా బెంగాలీలు ఈ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా భావిస్తారు. రవీంద్రనాథ్ టాగూరుకు నివాళులు అర్పించడానికి దీన్ని సందర్శిస్తారు. ఇక్కడి విద్యార్థులు పుష్యమేళా, రక్షాబంధన్, హోలీ వంటి అన్ని రకాల పండుగలు స్థానికులతో కలిసి సంబరంగా జరుపుకుంటారు. టాగూరు దీనిని జ్ఞానపీఠంగా కలలు కన్నాడు. దానిని గాంధీజీ, జవహర్‌లాల్ నెహ్రూ ప్రధాన భూమికను నిర్వహించి 1951లో కేంద్ర విశ్వవిద్యాలయంగా మారడానికి పాటుపడ్డారు" అని హిందూ దినపత్రిక పేర్కొన్నది.[4]

చరిత్ర

[మార్చు]
విశ్వభారతి విశ్వవిద్యాలయం 50వ వార్షికోత్సవం సందర్భంగా విశ్వవిద్యాలయ భవనం, రవీంద్రనాథ్ టాగూరు చిత్రాలతో 1971లో విడుదలైన తపాలాబిళ్ల

1863లో రాయ్‌పూర్ జమీందారు దేవేంద్రనాథ్ ఠాగూరుకు ఆశ్రమం నెలకొల్పడానికి ప్రస్తుతం ఛాతిమ్‌తాలా అని పిలువబడుతున్న స్థలాన్ని దానం చేశాడు. ఆ ఆశ్రమం తొలుత బ్రహ్మచర్యాశ్రమంగాను తరువాత బ్రహ్మచర్యవిద్యాలయం గాను పిలువబడింది. ఈ ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న అన్ని వర్గాల ప్రజలను యోగాభ్యాసం కొరకు ఆకర్షించడానికి ఉద్దేశించబడింది. 1901లో దేవేంద్రనాథ్ చివరి కుమారుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఆశ్రమం ఆవరణలో ఒక పాఠశాలను ఆరంభించాడు.

1901 నుండి ఠాగూర్ ఆశ్రమంలో హిందూమేళాను నిర్వహించడం ఆరంభించాడు. ఈ ఆశ్రమం జాతీయోద్యమానికి కేంద్రంగా నిలిచింది. 20వ శతాబ్దంపు తొలినాళ్ళలో ఇతర జమీందార్లు ఈ ఆశ్రమానికి తమ భూములను అమ్మివేశారు.

దేవేంద్రనాథ్ ఠాగూర్ 1863లో నిర్మించిన శాంతినికేతన్‌లోని ఉపాసనా గృహ (ప్రార్థనామందిరం)

నాలుగు గోడల మధ్య చదువుపై రవీంద్రనాథ్ ఠాగూరుకు కొన్ని నిర్దుష్ట అభిప్రాయాలున్నాయి. గోడలు మానసిక ప్రవృత్తికి అద్దం పడతాయని అతని నమ్మకం. అందుకే శాంతి నికేతన్‌లో తరగతి గదులలో కాకుండా ఆరు బయలు చెట్లక్రింద పాఠాలను చెప్పడం ప్రారంభించాడు. ఇతనికి బ్రిటిష్ ఇండియా ప్రవేశపెట్టిన పాశ్చాత్యవిద్యపై అంత సదభిప్రాయం లేదు. ఈ విషయంలో గాంధీజీ, ఠాగూర్‌ల అభిప్రాయాలు కలిసిపోయాయి. "నేను చదువుకున్నది నాకు గుర్తుండదు. నేను నేర్చుకున్నది మాత్రమే గుర్తుండిపోతుంది" అని ఓ సందర్భంలో ఠాగూర్ అన్నాడు. ఇతని అభిప్రాయం ప్రకారం ప్రతి వ్యక్తీ మేధావులే. కాకపోతే ప్రతి విద్యార్థి వికాసం ఏకకాలంలో జరగదు. అందుకే విశ్వభారతిలో ఠాగూర్ కొత్త విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాడు. ప్రతి విద్యార్థీ తాను చదువుతున్న కోర్సు తాను, ఉపాధ్యాయుడు ఇరువురూ సంతృప్తి చెందేవరకు కొనసాగవచ్చు. ఈ విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి కోరుకున్న కోర్సు లేకపోతే ఆ కోర్సుకు గిరాకీ ఉన్నా లేక పోయినా దానిని రూపకల్పన చేసి దానికి తగిన అధ్యాపకులను రప్పించి ఆ కోర్సును ప్రారంభిస్తారు.

పరిపాలన

[మార్చు]
ఉపాచార్యులు
  • రవీంద్రనాథ్ ఠాగూర్ , 1951–1953
  • క్షితి మోహన్ సేన్, 1953–1954 (తాత్కాలిక)
  • ప్రబోధ్ చంద్ర బాగ్చి, 1954–1956
  • ఇందిరా దేవి చౌదురాణి, 1956-1956 (తాత్కాలిక)
  • సత్యేంద్రనాథ్ బోస్, 1956–1958
  • క్షితిశ్చంద్ర చౌదురి, 1958–1959 (తాత్కాలిక)
  • సుధీరంజన్ దాస్, 1959–1965
  • కాళిదాస్ భట్టాచార్య, 1966–1970
  • ప్రతుల్ చంద్ర గుప్త, 1970–1975
  • సుర్జీత్ చంద్ర సిన్హా, 1975–1980
  • అమ్లన్ దత్తా, 1980–1984
  • నేమాయ్ సాధన్ బోసు, 1984–1989
  • అజిత్ కుమార్ చక్రవర్తి, 1989–1990
  • ఆశిన్ దాస్‌గుప్తా, 1990–1991
  • శిశిర్ ముఖోపాధ్యాయ, 1991-1991
  • సభ్యసాచి భట్టాచార్య, 1991–1995
  • శిశిర్ ముఖోపాధ్యాయ, 1995-1995
  • ఆర్.ఆర్.రావ్, 1995-1995
  • దిలిప్ కె.సిన్హా, 1995–2001
  • సుజిత్ బసు, 2001–2006
  • రజత్ కాంత రే, 2006–2011
  • సుశాంత కుమార్ దత్తగుప్త, 2011–2015

ఈ విశ్వవిద్యాలయం ప్రధాన అధికారులు పరిదర్శక (విజిటర్), ఆచార్య (ఛాన్స్‌లర్), ఉపాచార్య (వైస్‌ఛాన్స్‌లర్). భారత రాష్ట్రపతి ఈ విశ్వవిద్యాలయానికి పరిదర్శకునిగా, భారత ప్రధానమంత్రి ఆచార్యునిగా వ్యవహరిస్తారు. ఆచార్య అధ్యక్షతన "కర్మ సమితి" (ఎగ్జిక్యూటివ్ కమిటీ) ఈ సంస్థను నిర్వహిస్తుంది. ఈ విశ్వవిద్యాలయంలోని విద్యాసంస్థలు శాంతి నికేతన్‌లోను, శ్రీ నికేతన్‌లోను నెలకొని ఉన్నాయి.

ప్రవేశం

[మార్చు]

విశ్వభారతి విశ్వవిద్యాలయం ఉన్నత విద్యలో స్నాతక పూర్వ (10+2), స్నాతక, స్నాతకోత్తర, డాక్టరేట్ స్థాయిలలో అనేక కోర్సులు నడుపుతున్నది. ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి ప్రతి విద్యార్థి సక్రమ పద్ధతిలో ప్రయత్నించాలి. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాలి.

విద్యాసంస్థలు

[మార్చు]

ఈ విశ్వవిద్యాలయాన్ని సంస్థలుగా, కేంద్రాలుగా, విభాగాలుగా, శాఖలుగా విభజించారు. ఆయా విభాగాలు ఆయా సంస్థలలో చేరి వుంటాయి. భారత ప్రభుత్వపు శాస్త్ర సాంకేతిక విభాగం ఈ సంస్థలకు ఆర్థికవనరులను కల్పిస్తుంది. ఈ విశ్వవిద్యాలయ కోర్సులు కళలు, నృత్యం వంటి అత్యున్నత సాంస్కృతిక విలువలను కలిగివున్నాయి.

సంస్థలు, కేంద్రాలు

[మార్చు]
కళాభవనం, శాంతినికేతన్
  • రవీంద్ర భవనం (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాగూర్ స్టడీస్ అండ్ రీసర్చ్) [5]
  • చీనా భవనం (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైనీస్ లాంగ్వేజ్ అండ్ కల్చర్) [6]
  • హిందీ భవనం[7]
  • నిప్పోన్ భవనం[8]
  • బంగ్లాదేశ్ భవనం[9][10][11]
  • కళా భవనం (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) [12]
  • సంగీత్ భవనం (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డాన్స్, డ్రామా & మ్యూజిక్) [13]
  • శిక్షాభవనం (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్) [14]
  • విద్యాభవనం (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యుమానిటీస్ & సోషల్ సైన్సెస్) [15]
  • సెంటర్ ఫర్ యూరోపియన్ లాంగ్వేజస్, లిటరేచర్ & కల్చర్[16]
  • భాషాభవనం (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజస్, లిటరేచర్ & కల్చర్) [17]
  • వినయ భవనం (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్) [18]
  • పల్లి శిక్షాభవనం (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్) [19]
  • పల్లి సంఘటనా విభాగం (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ రికన్‌స్ట్రక్షన్) [20]

స్కూల్స్

[మార్చు]
  • పాఠ భవనం
  • మృణాలిని ఆనంద పాఠశాల
  • సంతోష్ పాఠశాల
  • శిక్షా సత్ర
  • ఉత్తర్ శిక్షా సదనం

ర్యాంకింగులు

[మార్చు]
విశ్వవిద్యాలయ ర్యాంకులు
జనరల్ - భారతదేశం
NIRF (అంతటా) (2018)[21]48
NIRF (విశ్వవిద్యాలయాలు) (2018)[22]31

నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ఈ విశ్వవిద్యాలయానికి దేశం మొత్తం మీద 48వ ర్యాంకును[21] విశ్వవిద్యాలయాలలో 31వ ర్యాంకును ఇచ్చింది.[22]. యు.ఎస్.న్యూస్ అండ్ వరల్డ్ వారి బెస్ట్ గ్లోబల్ యూనివర్సిటీస్ 2020 రిపోర్ట్ ప్రకారం విశ్వభారతి భారతీయ విశ్వవిద్యాలయాలలో 4వ స్థానం సంపాదించింది.[23]

లైబ్రరీ

[మార్చు]

విశ్వభారతి గ్రంథాలయాన్ని బ్రహ్మచర్య ఆశ్రమం ఆరంభించినపుడు 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించాడు. ప్రస్తుతం విశ్వభారతి గ్రంథాలయ వ్యవస్థ ఒక కేంద్ర గ్రంథాలయంతో పాటు చీనాభవనం, శిక్షాభవనం, పాఠభవనం, దర్శన్ సదనం, హిందీ భవనం, సంగీత్ భవనం, పల్లి సంఘటన విభాగం, వినయభవనం, రవీంద్రభవనం, పల్లి శిక్షాభవనం, కళాభవనం, శిక్షా సత్రాలలో 12 శాఖా గ్రంథాలయాలను కలిగి ఉంది. ఇవికాక సుమారు 30 సెమినార్ గ్రంథాలయాలు వివిధ విభాగాలకు అనుసంధానించి ఉన్నాయి.

విశ్వభారతి కేంద్ర గ్రంథాలయం

ఈ గ్రంథాలయంలో పురాతనమైన, అపురూపమైన బహు భాషా గ్రంథాలు, రిపోర్టులు, లిఖితప్రతులు, ఇతర డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈ గ్రంథాలయంలో రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రబోధ్ చంద్ర మొదలైన వారు సేకరించిన విలువైన గ్రంథాలున్నాయి.

క్యాంపస్ జీవితం

[మార్చు]
పౌష్యమేళా బజారు,2012

శాంతినికేతన్, శ్రీనికేతన్ అనే జంట గ్రామాలు భోల్‌పూర్, ఖేయ, సురుల్, ప్రాంతిక్ ల మధ్య ఉంది. విశ్వవిద్యాలయం, ఈ గ్రామాలు కొపాయ్ నది సమీపంలో ఉంది. ఈ విశ్వవిద్యాలయం సాంస్కృతిక ఉత్సవాలకు ప్రసిద్ధి.

  • వసంతోత్సవం: హోళీ పండుగను పాఠభవనం ముందున్న మైదానంలో జరుపుకుంటారు.
  • పౌష్యమేళా: ఈ వార్షిక ఉత్సవం పుష్యమాసంలో (డిసెంబరు నెలలో) జరుపుకుంటారు. ఇది స్థానిక ప్రజల హస్తకళావస్తువుల అమ్మకాలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడిన జాతర. మొదటి రోజు ఛాతిమ్‌తాలా వద్ద విశ్వవిద్యాలయం ఉపాసన సభను ఏర్పాటు చేస్తుంది. డిసెంబరు 24న మేలార్ మఠం వద్ద దీపాలంకరణ, బాణాసంచా వెలిగించడం ఉంటుంది. ఈ సంప్రదాయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రారంభించాడు. క్రిస్మస్ పండుగనాడు విశ్వవిద్యాలయం సర్వమతసామరస్యానికి గుర్తుగా క్రీస్తు ఉత్సవం నిర్వహిస్తారు.

శాంతి నికేతన్‌లో చదివిన పూర్వవిద్యార్థులలో తెలుగు ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Bidyut Chakrabarty takes over as VC of Visva Bharati University 05:46 IST". The Times of India. India. 10 November 2018. Archived from the original on 18 January 2019. Retrieved 16 January 2019.
  2. 2.0 2.1 2.2 "Visva Bharati - University Student Enrolment Details". www.ugc.ac.in. Archived from the original on 17 ఆగస్టు 2019. Retrieved 10 February 2020.
  3. "Association of Commonwealth Universities Membars-Asia". Archived from the original on 16 January 2019. Retrieved 16 January 2019.
  4. Bhattacharjee, Sumit (26 March 2012). "Tagore's Vision of an Institution". Colleges. The Hindu, 26 March 2012. Archived from the original on 16 May 2018. Retrieved 11 September 2019.
  5. "Rabindra Bhavana". Visva Bharati. Archived from the original on 18 జూలై 2019. Retrieved 23 August 2019.
  6. "Fond Memories – The Great Scholar Tan Yun Shan". Bina Roy Barman. Indira Gandhi National Cenre for the Arts. Retrieved 22 August 2019.
  7. "From Bharmacharyashrama to Visva-Bharati: A Chronicle of Metamorphosis of a Tiny School into an Internationally-Acclaimed Centre of Learning" (PDF). Chapter I, page 2. Visva Bharati. Archived from the original (PDF) on 16 మార్చి 2015. Retrieved 23 August 2019.
  8. Japanese Studies: Changing Global Profile. Northern Books / Google. 2010. ISBN 9788172112905. Retrieved 9 September 2019. {{cite book}}: |work= ignored (help)
  9. "Hasina, Modi open Bangladesh Bhavana at Visva-Bharati University in West Bengal". bdnews24.com, 25 May 2018. Archived from the original on 22 August 2019. Retrieved 22 August 2019.
  10. "Bangladesh Bhavana inaugurated at Viswa Bharati at Santiniketan". GKToday, 26 May 2015. 26 May 2018. Archived from the original on 22 ఆగస్టు 2019. Retrieved 22 August 2019.
  11. "Bangladesh Bhavana a symbol of cultural ties". Readers Buzz. Archived from the original on 22 ఆగస్టు 2019. Retrieved 22 August 2019.
  12. "Kala Bhavana". Visva Bharati. Archived from the original on 18 ఆగస్టు 2019. Retrieved 26 August 2019.
  13. "From Bharmacharyashrama to Visva-Bharati: A Chronicle of Metamorphosis of a Tiny School into an Internationally-Acclaimed Centre of Learning" (PDF). Visva Baharati. Archived from the original (PDF) on 16 మార్చి 2015. Retrieved 26 August 2019.
  14. "Siksha Bhavana". Visva Bharati. Archived from the original on 18 ఆగస్టు 2019. Retrieved 3 September 2019.
  15. "Vidya Bhavana". Visva Bharati. Archived from the original on 18 ఆగస్టు 2019. Retrieved 23 August 2019.
  16. "Centre for Modern European Languages, Literature and Culture Studies". Visva Bharati. Archived from the original on 19 జూలై 2019. Retrieved 23 August 2019.
  17. "Bhasa Bhavana". Visva Bharati. Archived from the original on 18 ఆగస్టు 2019. Retrieved 23 August 2019.
  18. "Vinaya Bhavana". Visva Bharati. Archived from the original on 18 ఆగస్టు 2019. Retrieved 22 August 2019.
  19. "Palli Siksha Bhabana". Visva Bharati. Archived from the original on 18 ఆగస్టు 2019. Retrieved 9 September 2019.
  20. "Palli- Samgathana Vibhag". Visva Bharati. Archived from the original on 18 ఆగస్టు 2019. Retrieved 9 September 2019.
  21. 21.0 21.1 "National Institutional Ranking Framework 2018 (Overall)". National Institutional Ranking Framework. Ministry of Human Resource Development. 2018.
  22. 22.0 22.1 "National Institutional Ranking Framework 2018 (Universities)". National Institutional Ranking Framework. Ministry of Human Resource Development. 2018.
  23. "Best Global Universities, 2020 by US News & World Report".{{cite web}}: CS1 maint: url-status (link)

బయటిలింకులు

[మార్చు]