iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: https://te.wikipedia.org/wiki/మే_14
మే 14 - వికీపీడియా Jump to content

మే 14

వికీపీడియా నుండి

మే 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 134వ రోజు (లీపు సంవత్సరములో 135వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 231 రోజులు మిగిలినవి.


<< మే >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31
2024


సంఘటనలు

[మార్చు]
  • 1607: జేమ్స్‌టౌన్ (వర్జీనియా), అమెరికా లోని ఆంగ్లేయుల మొట్టమొదటి శాశ్వత నివాస కేంద్రం.
  • 1638: అడ్మిరల్ ఆడం వెస్టెర్‌వోల్ట్, శ్రీలంక లోని బట్టికలోవ్ను జయించాడు.
  • 1643: లూయిస్ XIV (4), ఫ్రాన్స్ రాజు అయ్యాడు.
  • 1759: సలాబత్ జంగ్ ఆంగ్లేయులతో సంధి చేసుకొని గుంటూరు తప్ప ఉత్తర సర్కారు జిల్లాలన్నింటిని ఆంగ్లేయుల పరం చేశాడు.
  • 1796: ఎడ్వర్డ్ జెన్నర్ తను కనిపెట్టిన ఆటలమ్మ అని, అమ్మవారు అని పిలవబడే స్మాల్‌పాక్స్కి మందును, మొదటిసారిగా ప్రజలకు వేయటం మొదలుపెట్టాడు.
  • 1811: స్పెయిన్ దేశం నుంచి పరాగ్వే దేశం స్వాతంత్ర్యం పొందింది. (పరాగ్వే జాతీయదినం).
  • 1835: ఛార్లెస్ డార్విన్ ఉత్తర చిలీ దేశంలోని, కొక్వింబొ అనే చోటుకి చేరాడు.
  • 1842: 'లండన్ ఇల్లస్ట్రేటెడ్ న్యూస్' మొదటి సంచిక విడుదలయ్యింది.
  • 1845: 'ఉట్రెచ్ట్-అర్నెం' రైల్వే ప్ర్రారంభమయ్యింది.
  • 1853: 'గెయిల్ బోర్డెన్' తను కనిపెట్టిన 'కండెన్స్‌డ్ మిల్క్' చేసే పధ్ధతిని పేటెంట్ గా పొందాడు.
  • 1862: స్విట్జర్లాండ్కి చెందిన 'అడాల్ఫ్ నికోలె' 'క్రోనొగ్రాఫ్' ని పేటెంట్ గా పొందాడు.
  • 1878: వేసెలిన్ని మొదటిసారిగా అమ్మిన రోజు (పెట్రోలియం జెల్లీకి 'వేసెలిన్', రెజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్).
  • 1896: అమెరికాలో, 'మే' నెలలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైన రోజు (-10º ఫారిన్‌హీట్ - క్లైమాక్స్ సి.ఒ).
  • 1900: రెండవ ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్సు రాజధాని పారిస్లో ప్రారంభమయ్యాయి.
  • 1904: మూడవ ఒలింపిక్ క్రీడలు అమెరికా లోని 'సెయింట్ లూయిస్' నగరంలో జరిగింది. (అమెరికా లో, ఇవే మొదటి ఒలింపిక్ క్రీడలు
  • 1908: ప్రయాణీకులతో మొదటి విమానం ఎగిరిన రోజు
  • 1910: కెనడా వెండితో తయారుచేసిన 'డాలర్ నాణెము' లను అధికారికంగా విడుదల చేసింది.
  • 1921: ఫ్లోరెన్స్ అల్లెన్, మొదటి మహిళా న్యాయమూర్తి, ఒక మనిషికి మరణ శిక్ష విధించింది (అమెరికా).
  • 1935: లాస్ ఏంజెల్స్ నగరంలో 'గ్రిఫిత్ నక్షత్రశాల (ప్లానెటోరియం]' ను ప్రారంబించారు. (ఇది అమెరికాలో మూడవద్).
  • 1940: నెదర్లాండ్స్ లోని రోటర్‌డాం నగరం మీద నాజీలు బాంబులు వేయగా 600 నుంచి 900 మంది ప్రజలు మరణించారు. నెదర్లాండ్స్ జర్మనీకి లొంగి పోయింది.
  • 1948: ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ఏర్పడింది. 'డేవిడ్ బెన్ గురియన్' ప్రధానమంత్రి.
  • 1948: ఇజ్రాయెల్ రేడియో స్టేషను 'కోల్ ఇజ్రాయెల్' మొదటిసారిగా తన ప్రసారాలను మొదలుపెట్టింది.
  • 1948: ఇజ్రాయెల్ దేశాన్ని, అమెరికా గుర్తించింది.
  • 1948: అమెరికా, అణుబాంబును 'ఎన్వెటక్' అనే చోట, వాతావరణంలో పేల్చి పరీక్షించింది.
  • 1955: అమెరికా అణుబాంబును పసిఫిక్ మహా సముద్రంలో పేల్చి పరీక్షించింది.
  • 1955: కమ్యూనిష్టు దేశాల మధ్య వార్సా ఒప్పందం కుదిరింది. (కమ్యూనిష్టు దేశాలంటే - సోవియాట్ యూనియన్, అల్బేనియా, బల్గేరియా, చెకొస్లొవాకియా, తూర్పు జర్మనీ, హంగరీ, పోలాండ్, రుమేనియాలు)
  • 1960: మనుషులు లేని రోదసీ నౌకను రష్యా దేశం (పాత యునైటెడ్ సోవియట్ సోషలిస్టు రష్యా) రోదసీ లోకి పంపింది.
  • 1962 అమెరికా అణుబాంబును క్రిస్ట్‌మస్ దీవులలోని, వాతావరణంలో పేల్చి, పరీక్షించింది.
  • 1965: ఛైనా తన రెండవ అణుబాంబును పేల్చి పరీక్షించింది.
  • 1965: అమెరికా అణుబాంబును నెవడా పరీక్షా కేంద్రంలో పేల్చి, పరీక్షించింది.
  • 1968: చెకొస్లావేకియా ప్రభుత్వం, 'అలెగ్జాండర్ డుబ్‌సెక్' నాయకత్వంలో, సరళీ కరణ సంస్కరణలు మొదలు పెట్టింది.
  • 1968 : 60వ దశకములో చైనా, పాకిస్తాన్ లతో యుద్ధాల తర్వాత సైనికులేకాక సామాన్య పౌరులు కూడా సుశిక్షితులై అప్రమత్తంగా ఉండటం అవసరమని గ్రహించి, భారత ప్రభుత్వం పౌర రక్షణ సంస్థను చట్టబద్ధం చేసింది.
  • 1969: 'గర్భస్రావం', 'గర్భనిరోధం' కెనడా దేశంలో చట్టబద్ధమయ్యాయి.
  • 1973: లండన్లో బంగారం ఔన్సు ధర 102.50 అమెరికన్ డాలర్లకు పెరిగి, రికార్డు స్థాపించింది.
  • 1973: మొదటి రోదసీ కేంద్రం, స్కైలాబ్ను రోదసీలోకి ప్రయోగించారు.
  • 1973: అమెరికా సుప్రీం కోర్టు అమెరికా సైన్యంలోని మహిళ లకు సమాన హక్కులు కల్పించింది.
  • 1975: అమెరికా అణుబాంబును నెవడా పరీక్షా కేంద్రంలో పేల్చి, పరీక్షించింది.
  • 1981: 'నాసా' రోదసీ నౌక 'ఎస్-192' ని రోదసీ లోకి ప్రయోగించింది.
  • 1982: 'గినియా' దేశం తన రాజ్యాంగాన్ని అమలు చేసింది.
  • 1986: నాజీ ల పాలనలో క్షణక్షణం అనుభవించిన, భయంకరమైన, బాధాకరమైన రోజులను 'అన్నే ఫ్రాంక్' అనేబాలిక రాసిన దినచర్య పుస్తకం'అన్నే ఫ్రాంక్ డైరీ' ని 'ఇన్‌స్టిట్యూట్ ఫర్ వార్ డాక్యుమెంట్స్' పూర్తిగా ప్రచురించింది.
  • 1989: ఛైనా లోని 'తియాన్మెన్ స్వేర్' లో 'ప్రజాస్వామ్యహక్కుల' కోసం ప్రదర్శన జరిగింది.
  • 1990: 'డౌ జోన్స్' 2821.53 స్థాయిని తాకి, రికార్డ్ ను నెలకొల్పింది.
  • 1995: 14వ దలైలామా 6 సంవత్సరాల 'గెధున్ చోక్యి నీమా' (జననం :1989 ఏప్రిల్ 25) ను 'పంచన్‌లామా' 11వ అవతారంగా ప్రకటించాడు.
  • 2004: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.యస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాడు.
  • 2012: డాలరుతో రూపాయి మారకం విలువ అతి తక్కువగా రూ 53.96 కి పడిపోయింది. 2012 మే 18 నాడు, రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 54.91 స్థాయికి పడిపోయింది. రూపాయిడాలరు మారకం విలువ చరిత్రలో, ఇది, అత్యంత తక్కువ స్థాయి.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

పండుగలు , జాతీయ దినాలు

[మార్చు]
  • -

బయటి లింకులు

[మార్చు]

మే 13 - మే 15 - ఏప్రిల్ 14 - జూన్ 14 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=మే_14&oldid=4337871" నుండి వెలికితీశారు