iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: https://te.wikipedia.org/wiki/పలభా_యంత్రము
పలభా యంత్రము - వికీపీడియా Jump to content

పలభా యంత్రము

వికీపీడియా నుండి
కాకరపర్తి భావనారాయణ కళాశాలలోని పలభా యంత్రము
అన్నవరం సత్యనారాయణ దేవాలయ ప్రాంగణంలోని పలభా యంత్రం
నీడ గడియారం
కాల యంత్రం
పలక పలభా యంత్రము

సూర్యుని గమనం ద్వారా సమయాన్ని తెలిపే పరికరమును పలభా యంత్రము అంటారు. దీనినే నీడ గడియారం అని కూడా పిలిచెదరు. వీటిలో అనేక రకములు ఉన్నాయి. సమతలముగా ఉండే పలభాయంత్రముపై సూర్యుని గమనము వలన ఏర్పడే నీడ ద్వారా సమయాన్ని నిర్ధారిస్తారు. సన్నని, పదునైన అంచు కలిగిన శంకువు ద్వారా సమయమును కొలిచెదరు. పలభా యంత్రముపై గంటలను తెలుపు గీతలు ఉంటాయి. సూర్యుడు ఆకాశంలో కదులు కోణాన్ని బట్టి శంకువు యొక్క నీడ గంటల గీతలపై పడును. ఈ విధముగా భౌగోళిక అక్షాంశాలను ఉపయోగించి సమయాన్ని తెలుపవచ్చు.

చరిత్ర

[మార్చు]

పురావస్తు పరిశోధనల ప్రకారం ఈజిప్టుల ఖగోళశాస్త్రంలో, బేబిలోనియల్ ఖగోళశాస్త్రములలో పలభా యంత్రములను వినియోగించేవారు. క్రీస్తు పూర్వం 3500 కాలంలో ఒబెలిస్కు, క్రీస్తు పూర్వం 1500 కాలంలో నీడ గడియారములు వాడే వారు. పూర్వపు కాలంలో మనుషులు వారి నీడ యొక్క పొడవును బట్టి కూడా సమయాన్ని నిర్ధారించేవారు. కానీ అది చాలా క్లిష్టమైన పని. తరువాతి కాలంలో ఇటాలియన్ ఖగోళ శాస్త్రజ్ణ్ణుడైన జియోవన్ని పదోవని సమతల, నిలువుగా ఉండు పలభా యంత్రముల రేఖాచిత్రాలను రూపొందించాడు. 16వ శతాబ్దం నుండి పలభా యంత్రముల వాడుక ప్రారంభమైందని చెబుతారు.

పలభాయంత్రములలో రకాలు

[మార్చు]

స్థిర శంకువుతో కూడిన పలభా యంత్రములు

[మార్చు]

భూమధ్యరేఖను వాడి సమయాన్ని తెలిపే పలభా యంత్రములు

[మార్చు]

దీనిలో సమతాళీయ ఉపరితలంపై పడే నీడను బట్టి సమయాన్ని తెలిపేవారు.

సమతల పలభా యంత్రములు

[మార్చు]

దీనిలో శంకువు లంబరేఖలో కాకుండా క్రింది సూత్రమును వినియోగిస్తారు.

నిలువుగా ఉండు పలభా యంత్రములు

[మార్చు]

దీనిలో శంకువు భూభ్రమణ అక్షముకు తగ్గట్టుగా ఉండును. అదే విధముగా ఈ క్రింది సూత్రమును పాటించును.

ధ్రువ గడియారములు

[మార్చు]

వీనిలో ఈ క్రింది సూత్రమును వినియోగించి సమయాన్ని కొలిచెదరు.

కదిలే శంకువు కలిగిన పలభా యంత్రములు

[మార్చు]

ఈ నీడగడియారములో శంకువును సంవత్సరం పొడవునా కదపవచ్చు, అనగా ఇందులోగంటల రేఖలకు కేంద్రీక్రుతమై వున్న శంకువును మనం జరపవచ్చు.దీనివల్ల కలిగే ఉపయోగం ఏమిటంటే, దీనిని ఖగోళ స్తంభాలకు అనుగునంగా అమర్చనవసరం లేదు, సంపూర్ణంగా నిలువుగా ఉంచవచ్చు.దీనివల్ల ఇంకో ఉపయోగం ఏమనగా, దీనిని స్థిరమైనశంకువు కలిగిన నీడగడియరంతో కలిపితే ఏ ఇతర సహాయం లేకుండా కచ్చితమైన ఉత్తరదిక్కును కనుగొనవచ్చు.రెండు నీడగడియరాలసమయం ఒకటైనప్పుడు మాత్రమే ఆ రెండిటిని కలుపగలం.ఈ లక్షణం చిన్న పలభా యంతములకు బాగా ఉపయోగపడుతుంది.

ఇతర రకముల పలభా యంత్రములు

[మార్చు]

కొన్నిసార్లు వేరువేరు రకాల నీడగడియారాలను ఒకటిగా కలుపుతారు.ఒకవేళ వేరువేరు సిద్దాంతాల మీద పనిచేయు రెండు లేదా అంతకంటే ఎక్కువ నీడగడియారాలను కలిపితే, ఉదాహరణకు సంపూర్ణ నిలువుగా ఉన్న నీడగడియారాన్ని సమాంతర నీడగడియారంతో కలిపితే స్వయంగా అమరే నీడగడియారం తయారవుతుంది మరొక విధంగా చ్చెప్పాలంటే దీనితో ఉత్తర దిక్కును కనుగొనవలసిన అవసరంలేదు, ఆ రెండు గడియారాల సమయం ఒకటైనప్పుడు స్వియ అమరిక జరుగుతుంది.ఇది చిన్న పలభా యంత్రాలలో అవసరమైన ఒక ఉపయోగం ఐనప్పటికీ చాలా మట్టుకు ఒకేలా ఉన్న సిద్దాంతం మీద పనిచేసే గడియారాలను మాత్రమే అనుసందానం చేస్తారు కనుక స్వియ అమరిక జరగదు.

పలక నీడ గడియారం

[మార్చు]

పలక నీడగడియారంలో రెండు పలకలు ఒక కీలు ద్వారా అతికించబడతాయి.పలకనీడ గదియారాన్ని చిన్న పలకగా మడవవచ్చు, దానివల్ల దానిని జేబులో సులువుగా తీసుకునిపోవచ్చును.వీటిని తెల్ల దంతములతో తయారుచెసి నల్లని లక్కలో పొదుగుతారు.శంకువుని నల్లనిపట్టు, నార లేదా జానపనార దారాలతో అల్లుతారు.పూసలను తీగలపై ముడిలా సరైన గుర్తులతో అమరుస్తారు.ఇందులో పంటలు వేయుటకు సరిపడ పంచాగాన్ని అమర్చవచ్చు.ఒక సాదారణ తప్పు కూడా పలకనీడ గడియారం యొక్క స్వియ అమరికను సూచిస్తుది.ఇది తీగ శంకువును ముఖముల మధ్య ఉపయోగించు సమాంతర లేదా నిలువు రేఖ పలభా యంత్రముల అమరిక ఎలా ఉన్నను వర్తించదు. ఎందుకనగా ఇందులో తీగ శంకువు దీర్ఘంగా కొనసాగుతుంది, కాని నీడ కచ్చితంగా తీగను తాకవలెను.కనుక వాటిని ఎలా అమర్చినా ఒకే సమయాన్ని చూపుతాయి.

బహుముఖ పలభాయంత్రం

[మార్చు]

సాధారణంగా రెండు లేదా అంతకంటె ఎక్కువ పలభా యంత్రములను ఒక ప్లేటోనిక్ ఘనం సాధారనముగా చతురస్ర ఘనం యొక్క ప్రతిముఖము వద్ద అమర్చడాన్ని బహుముఖ పలభాయంత్రం అంటారు.విశేషంగా అలంకరించిన పలభా యంత్రములను ఈ విధముగా తయారు చేస్తారు, అనగా చతురస్ర ఘనం యొక్క ప్రతీ భుజము వద్ద ఒక పలభా యంత్రాన్ని అమరుస్తారు.కొన్ని సందర్భాలలో పలభా యంత్రములను చతురస్ర ఘనంలో పల్లముగా నిర్మిస్తారు, ఉదాహరణకు స్థూపాకార బోలును భూమి యొక్క భ్రమణాక్షంతో లేదా hemisphaerium లేదా antiboreum పురాతన సంప్రదాయంలోని గోళాకార బోలుతో అమరుస్తారు.కొన్ని సందర్భాల్లో పలభా యంత్రాలు చిన్నవిగా మరికొన్ని సందర్భాలలో పెద్ద రాయి స్మారక కట్టడాలు అంత పెద్దగా ఉంటాయి.

అటువంటి పలభాయంత్రములు ప్రతిరోజు ప్రతిపూట సూర్య కాంతిని పొందుతాయి.వాటిని వేర్వేరు సమయ-మండలాల సమయాన్ని చూసేటట్టు కూడా నిర్మించవచ్చు.సాధారణంగా వాటికి స్వీయ అమరిక రాదు. ఎందుకనగా వాటియొక్క వివిధ పలభాయంత్రములు సమయం సూచించుటకు ఒకే సిద్ధాఒతాన్ని ఉపయోగిస్తాయి, అదే శంకువును భూమి యొక్క అక్షానికి సమానంగా అమర్చే విధానం. కాని స్వీయ అమరిక జరిగే పలభా యంత్రములలో కనీసం రెండు విభిన్న సిద్ధాంతముల మీద పనిచేయు పలభా యంత్రములను వాడ వలెను, ఉదాహరణకు సమాంతర పలభాయంత్రం, analemmatic డయల్.కొన్ని సందర్భాలలో బహుముఖ పలభాయంత్రములను కదుపకుండా ఉండే విధముగా ఒక కట్టడంలా నిర్మిస్తారు కనుక వాటిలో అమరిక ఒక్కసారే జరుగవలెను.

పలభా యంత్రముల తయారీ, సమయాన్ని కొలిచేందుకు వాడు దిద్దుబాట్లు

[మార్చు]
  • రేఖాంశాల వారిగా సమయాన్ని కొలిచేందుకు కొన్ని దిద్దుబాట్లు చెయవలసి ఉంటుంది.
  • సూర్యుని గమనము నీడ ద్వారా తెలిసినప్పటికీ అది కచ్చితమైన సమయాన్ని తెలుపలేకపొవచ్చు. దీనికై కొన్ని అదనపు సూత్రములను వినియోగించవలసి ఉంటుంది.