నయాగరా జలపాతం
నయాగరా జలపాతం | |
---|---|
ప్రదేశం | అంటారియో సరిహద్దు, కెనడా & న్యూయార్క్, U.S.A. |
అక్షాంశరేఖాంశాలు | 43°04′48″N 79°04′16″W / 43.080°N 79.071°W |
రకం | పెద్ద జలపాతం |
మొత్తం ఎత్తు | 167 అ. (51 మీ.) |
బిందువుల సంఖ్య | 3 |
నీటి ప్రవాహం | నయాగరా నది |
సగటు ప్రవాహరేటు | 64,750 cu ft/s (1,834 m3/s) |
నయాగరా జలపాతం (Niagara Falls) అమెరికా రాష్ట్రమైన న్యూయార్క్, కెనడా నగరాల మధ్య నయాగరా నదిపై ఉన్న అతిపెద్ద జలపాతం. నయాగరా జలపాతం అంటే మూడు జలపాతాల మొత్తానికి ఉన్న సామూహిక నామము. అమెరికా లోని న్యూయార్క్ రాష్ట్రం, కెనడాలోని ఒంటారియా రాష్ట్రం సరిహద్దుల మధ్య అటూ ఇటూ ఉన్న జలపాతమిది. ఈ జలపాతం నయాగర జార్జ్ దక్షిణ తీరంలో ఉంది. పెద్ద మరుయి చిన్నది వరకు ఈ జపపాతం గుర్రపునాడా ఆకారంలో ఉంది. మెరికన్ ఫాల్స్, బ్రైడల్ వెయిల్ ఫాల్స్ అమెరికన్ ప్రాంతంలో ఉన్నాయి. ది హార్స్ షూ ఫాల్స్ కెనడా ప్రాంతంలో ఉన్నాయి. అమెరికన్ ఫాల్స్ అమెరికా వైపు గోటు ఐలాడ్ (గోట్ ద్వీపం)ద్వారా విభజించబడి ఉంటాయి. చిన్నదైన బ్రైడల్ వెయిల్ ఫాల్స్ కూడా అమెరికన్ ప్రాంతంలో ల్యూనా ఐలాండ్ (ల్యూనా ద్వీపం) విభజింపబడి ఉన్నాయి. హార్స్ షూ ఫాల్స్ గుండా అంతర్జాతీయ సరిహద్దు 1892 లో చేయబడింది. సహజ భూఊచకోత వలన ఈ సరిహద్దులు తరచూ వివాదాస్పదం అవుతుంటాయి.
ఎరీ సరసు నుండి ఒంటారియా సరసు లోకి ప్రవహిస్తున్న నయాగరా నది జలం యొక్క జలపాత సమూహం నుండి పడుతున్న జలం ప్రపంచంలోని మిగిలిన జలపాతాల కంటే అత్యధిక మని భావిస్తున్నారు. నిలువుగా పడుతున్న జలపాతం ఎత్తు 165 అడుగులు. ఉత్తర అమెరికాలోనే హార్స్ షూ జపాతం ఎత్తు, జలం పరిమాణంలోకి తీసుకుంటే అత్యంత శక్తి వంతమైనదిగా భావించబడుతుంది. ఈ జలపాతం బఫెల్లో నగరానికి 27 మైళ్ళ దూరంలో ఉంది, న్యూయార్క్, ఆగ్నేయ టొరంటోల నుండి 75 మైళ్ళ దూరంలో రెండు నగరాల మధ్యగా ఉంది. దీనిని నయాగరా ఒంటారియో, నయాగరా న్యూయార్క్ అని వ్యవహరిస్తుంటారు.
విస్కాంసిన్ మంచుదిబ్బల చివరి నుండి అవి కరుగుతున్న కారణంగా (హిమయుగాంతం నుండి)ఈ జలపాతాలు రూపుదిద్దుకున్నాయి . అలాగే కొత్తగా ఏర్పడిన బృహత్తర సరసులు తమకు తామే తొలుచుకుని నయాగరా ఏస్ఖేప్మెంట్ ద్వారా ఒక మార్గం ఏర్పరచుకుని పసిఫిక్ సముద్రాన్ని చేరుకుంటాయి. ఇవి ప్రత్యేకంగా అత్యంత ఎత్తు లేకున్నా అత్యంత వెడల్పైనవిగా గుర్తించబడ్డాయి. 6 మిలియన్ల ఘనపు అడుగుల జలం ఈ జలపాతం నుండు అత్యంత శక్తితో కిందకు పడుతూ ఉంటుంది. అయినప్పటికీ సరాసరి ప్రవాహ పరిమాణం 4,000 ఘనపు అడుగులు. నయాగరా జలపాతం ఏక సమయంలో సౌందర్యానికి అలాగే జలవిద్యుత్తు ఉపయోగానికి పేరు పొందింది. 19వ శతాబ్దం నుండి జలపాత అధికారులకు వినోదం, వాణిజ్యం, పారిశ్రామిక ప్రయోజనాల మధ్య సమతూకం కాపాడడానికి ఒక సవాలుగా మారింది.
నామ చరిత్ర
[మార్చు]దీనికాపేరు ఎలా వచ్చిందన్న దానికి వివిధ సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. బ్రూస్ ట్రిగ్గర్ అనే ఇరాకీ శాస్త్రజ్ఞుడు అభిప్రాయాల ప్రకారం, 17వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచి మ్యాప్ లో చూపించినట్లుగా ఈ ప్రాంతంలో నయాగరేగా అనే జాతికి చెందిన ప్రజలు నివసించేవారనీ, దాన్నుంచి ఈ జలపాతానికి ఈ పేరు వచ్చిఉండవచ్చునని అతడి భావన.
పరిశ్రమలు, వాణిజ్యంపై దీని ప్రభావం
[మార్చు]దీనివల్ల ఉత్పన్నమయ్యే అపారమైన శక్తిని విద్యుచ్చక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించవచ్చునని ఏనాడో గుర్తించడం జరిగింది. 1759లో మొట్టమొదటి సారిగా అటువంటి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. డేనియల్ జాన్‌కైర్ తన సామిల్ అవసరాలకోసం దీనిపై ఒక కాలువను నిర్మించాడు.
లక్షణాలు
[మార్చు]నయాగరా జలపాతం రెండు భాగాలుగా విభజించబడింది.ఒకటి హార్స్‌షూ ఫాల్స్ రెండవది అమెరికన్ ఫాల్స్ .హార్స్ షూఫాల్స్ ఎత్తు 173 అడుగులు.అమెరికన్ ఫాల్స్ ఎత్తు 70-100 అడుగులు.హార్స్ షూ ఫాల్స్ వెడల్పు 2,600 అడుగులు,అమెరికన్ షూ ఫాల్స్ వెడల్పు 1,060 అడుగులు. అమెరికన్ సరిహద్దు తీరం, కెనడా సరిహద్దు తీరం మధ్య దూరం 3,409 అడుగులు.
జలప్రవాహం శిఖరాగ్రంలో ఉండే సమయంలో నయాగర జలపాతం నుండి ఒక సెకండుకు 2,02,000 ఘనపు అడుగుల జలం పడుతుంది. ఈ జలపాతం కెనడాలోని లేక్ ఎర్రీ సరసు నిండి పొర్లి ప్రవహించే నీటి వలన ఏర్పడింది.ఈ జలం నయాగరా జలపాతంగా పడి నయాగరా నదిగా ప్రవహించి ఒంటారియా సరసు చేరుకుంటుంది. ఇది వసంతకాలం చివరి భాగం లేక ఎండా కాలం ఆరంభంలో అత్యధికగా ప్రవహిస్తుంది. వేసవి కాలంలో 90% నీటిని హార్స్ షూ ఫాల్స్ లో వదిలి 10% నీటిని జలవినియోగానికి వాడుకుంటారు. హార్స్ షూ ఫాల్స్ పైభాగంలో లాకులను ఉపయోగించి నీటిని క్రమబద్దీకరిస్తారు. పగటి పూట 1,00,000 ఘనపు అడుగుల నీటిని రాత్రి, చలికాలంలో 50,000 ఘనపు అడుగుల నీటిని జలపాతానికి వదిలివేస్తారు. నయాగరా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్వర్యంలో 1950లో జరిగిన ఒప్పందాన్ని అనుసరించి నీటిని క్రమబద్దీకరిస్తుంటారు.
లేత ఆకుపచ్చ రంగులో భూమిని కోసుకుంటూ ప్రవహిస్తున్న ఈ జలపాత జలాలు ఒక నిమిషానికి 60 టన్నుల కరిగిన ఉప్ప, రాతిపిండిని తీసుకుని వచ్చి నయాగరా నదిలో పడవేస్తుంది. ప్రస్తుత నయాగరా పూడిక ఎత్తు సంవత్సరానికి ఒక అడుగు. చారిత్రక పూడిక ఎత్తు సరాసరి 3 అడుగులు. ఈ భూమి ఊచకోత కారణంగా ఎర్రి సరసు లోతు తగ్గి పోవడం కారణంగా ఇప్పటి నుండి 50,000 సంవత్సరాల తరువాత నయాగరా సరసు ఉనికిని కోల్పోతుందని భావిస్తున్నారు.
అమెరికన్ వైపునుండి కొంచం ప్రక్కకు తిరిగినట్లు కనిపించే ఈ జపాతం కెనడా నుండి చక్కగా ఎదురుగా కనిపిస్తుంది.ఈ జలపాతం టొరంటో నుండి రెండు గంటల వాహన ప్రయాణ దూరంలో ఉంది.
నయాగరా జలపాతం విస్‌కాన్‌సిన్ గ్లాసియర్స్ కరగటం కారణంగా 10,000 సంవత్సరాల పూర్వం నుండి ఏర్పడింది.ఉత్తర అమెరికాలోని గ్రేట్ లేక్స్ ఈ కారణంగా ఏర్పడ్డాయని అభిప్రాయ పడుతున్నారు.మొత్తం చేరి బృహత్తర హిమ ఖండం ఏర్పడటంతో అవి కరిగినప్పుడు ఏర్పడే నీటిని క్రమ పరచడానికి నదీజలాల కాలువలను వెడల్ప చేసి సరసులు ఏర్పరచి ఆనకట్టలు నిర్మించారని శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు.గ్లాసియర్ డ్రిఫ్ట్ క్రింద ఒక లోయ మునిగిపోయినట్లు శాస్త్రజ్ఞుల విశ్వాసం.
భౌగోళిక స్వరూపం
[మార్చు]విస్కోన్సిన్ హిమనదీయం (విస్కోన్సిన్ గ్లాసియేషన్) కరగడం కారణంగా తయారైన జలప్రవాహం వలన ఏర్పడిన నయాగరా జలపాతం వయసు దాదాపు 10,000 సంవత్సరాలు. ఇదే జలప్రవాహాలు ఉత్తర అమెరికన్ పెద్ద సరసులు, నయాగరా నది ఏర్పడడానికి కారణం అయ్యాయి. ఇవన్ని ఖండాంతర మంచుదిబ్బలు కరగడం కారణంగా ఈ ప్రాంతంలోని నదీ కాలువలను లోతుచేస్తూ మరికొన్ని సరసులు ఏర్పడడానికి అలాగే విస్తారమైన చెత్తాచెదారం అడ్డుకట్టలుగా ఏర్పడడానికి కారణం ఔతున్నాయి. శాస్త్రజ్నులు వెల్ లాండ్ కాలువ ప్రాంతాలలో ఉన్న లోయలు హిమప్రవాహంతో కప్పబడ్డాయని వాదిస్తున్నారు.
బృహత్తర సరసుల నుండి మంచుగడ్డలు కరిగి జలప్రవాహాన్ని నయాగరా నదిలోకి ఒంపేసి నయాగరా ఏటవాలు వద్ద తిరిగి ఆకృతి దాలుస్తుంది. కొన్ని సమయాలలో ఈ నది ఉత్తరంగా ఉన్న కొండలను చీల్చుకుంటూ ప్రవహస్తుంది. ఈ జలప్రవాహపు ఒరిపిడికి ఇక్కడ ఉన్న ప్రధానమైన మూడు కొండలలో మూడు సమానంగా కరిగి పోలేదు. ఎత్తైన కొండలు ఒరిపిడిని నిరోధించగలిగిన సున్నపురాయి, లాక్ పోర్ట్ డోలోస్టోన్ (మధ్య సిల్యూరియన్) లతో తయారైనది. ఈ కఠినమైన రాతి పొరలు కింద ఉన్న ఖనిజపు పొరలకంటే తక్కువగా అలాగే నిదానంగా ఒరిపిడికి గురి ఔతాయి. కుడి పక్కన ఉన్న ఆకాశ చిత్రం కఠినమైన కేప్ రాక్ (మధ్య సిల్యూరియన్) ను చూపిస్తుంది.
కఠినశిలకు తరువాత మూడింట రెండు వంతులు కొండ కొంత బలహీనంగా, మెత్తగా, ఏటవాలుగా రోచెస్టర్ నిర్మాణం (దిగువ సిల్యూరియాన్ ) ఉంటుంది. ఈ కొండ చాలా తేలికగా పలుచని సున్నపు రాళ్ళ పొరలను కలిగి ఉంటుంది. ఇందులో పురాతన శిలాజాలు కూడా ఉంటాయి. నది మెత్తటి భాగాలను కరిగించినప్పుడు దానికి బలంగా ఉన్న కఠిన శిలలు నూతన రూపాలను సంతరించుకుంటాయి. ఇది నిరంతరంగా జరుగుతున్న కారణంగా తుదకు వంపైన వెడల్పైన జలపాతం రూపుదిద్దుకుంది.
గవ్వలు, ఇసుకరాళ్ళతో ఏర్పడిన క్వీన్ స్టన్ పొరల (ఎగువ ఓర్డోవిషియన్)వద్ద దిగువ లోయలలో నదీ సంగమం చూపులకు కొంచెం మరుగుగా ఉంటుంది. ఈ శిలారూపాలన్నీ ఒక పురాతన సముధ్రాంతర్గత భూమిలో ఉన్నాయి. సముద్రంలోని పరిస్థితిలో జరిగిన మార్పుల కారణంగా ఈ శిలారూపాలు ఏర్పడ్డాయి.
10,090 సంవత్సరాల ముందు నయాగరా జలపాతాలు ప్రస్తుత క్వీన్ స్టన్, ఒంటారియో, ల్యూస్టన్, న్యూయార్క్ మధ్య ఉండేది. కాని భూమి ఊచకోతకు గురి అయిన కారణంగా జలపాతాలు సుమారు దక్షిణదిశగా 6.8 మైళ్ళకు తమ మార్గాన్ని మార్చుకున్నాయి. 2,600 అడుగుల వెడల్పున్న హార్స్ షూ జలపాతం కూడా ఈ భూఊచకోత కారణంగా తన రూపాన్ని మార్చుకుంది. ఫలితంగా చిన్నదిగా ఉన్న ఆర్చ్ పెద్దగిగా బృహత్తరమైన గుర్రపు నాడా ఆకారంగా మారింది. అమెరికన్ ప్రాంతానికి పడమటి దిశగా కెనిడియన్ హార్స్ షూ జలపాతాలు తూర్పుగా అమెరికన్ బ్రిడల్ వెయిల్ జలపాతాలు ఉన్నాయి. జలపాతానికి కొంచెం ఎగువన ఉన్న ప్రవాహాన్ని గోట్ ఐలాడ్ వేరు చేస్తూ ఉంటుంది. ఇంజనీరింగ్ యుక్తి భూఉచకోతను, మంద్యాన్ని తగ్గిస్తూ ఉంది.
చరిత్ర
[మార్చు]నయాగరాకు ఈ పేరు రావటంలో భిన్నాప్రాయాలు ఉన్నాయి.ఇరోక్వియన్ స్కాలర్ బ్రూస్ ట్రిగ్గర్పరిశోధన అనుసరించి ఈ ప్రాంతంలో నివసించిన న్యూట్రల్ ఫెడరసీకి చెందిన ఉత్తర అమెరికా ఆదివాసులచే ఈ ప్రాంతం నయాగగరిగాగా వర్ణించ బడినట్లు 17శతాబ్ధపు చివరికాలా నికి చెందిన ఫ్రెంచి భౌగోళికచిత్రాలు ఆధారంగా తెలుస్తుంది.నయాగగరిగా పేరు నుండి నయాగరా వచ్చినట్లు అభిప్రాయపడుతున్నారు.
1604లో ఫ్రెంచ్‌దేశస్థుడైనశామ్యుఏల్ డీ చాప్లెయిన్ కెనాడా పరిశోధనలో భాగంగా ఈ ప్రదేశాన్ని సందర్శించినట్లు అతని వ్రాతలలో వర్ణించబడింది. మొదటిగా అతని సమూహంలోని సభ్యుల ద్వారా ఈ ప్రాంతంలోని జలపాతసౌందర్యం విని దానిని సందర్శించినట్లు వ్రాసుకున్నాడు.ఫిన్నిష్ స్వీడిష్ ప్రకృతి ఆరాధకుడు పెర్ కామ్ 17 వశతాబ్ధపు ఆరంభంలో ఈ ప్రదేశాన్ని చేరుకున్నట్లు అతను వ్రాసిన అనుభవాలు చెప్తున్నాయి.1677లో బెల్జియన్ ఫాదర్ లూయిస్ హెన్నెపిన్ ఈ ప్రదేశాన్ని పరిశీలించి దానిని గురించి వ్రాసుకున్నాడు.తరువాతి కాలంలో ఇక్కడకు చేరిన రెనె రాబర్ట్ కేవ్‌లియర్,సియూర్ డీ లాసెల్లె ల వలన ఈ జలపాతాలు యురోపియన్ల దృష్ట్ని ఆకర్షించాయి.హెన్నెపిన్ కంటే 35 సంవత్సరాల మునుపే ఫ్రెంచ్ జీసూట్ రివరెండ్ పౌల్ రాగ్యున్యూ కెనడాలోని హురాన్ ఫస్ట్ నేషన్ కోసం పనిచేస్తున్న సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు విశ్వసనీయమైన ఆధారాలు చెప్తున్నాయి. న్యూట్రల్ నేషన్లో కొంతకాలం నివసించిన జీన్ బ్రీబ్యూఫ్ ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు ఆధారాలూ చెప్తున్నాయి.
18వ శతాబ్దంలో పర్యాటకం ప్రబలం కాసాగింది శతాబ్ధపు మధ్యకాలంనాటికి అది ఇక్కడి ముఖ్య పరిశ్రమగా మారింది.19వ శతాబ్ధపు ఆరంభ కాలంలో నెపోలియన్ బొనాపార్ట్స్ సోదరుడు తన వివాహానంతరం సరికొత్త దంపతులుగా ఇక్కడకు వచ్చినట్లు అభిప్రాయపడుతున్నారు.1837 ది కెరోలి అఫైర్ సమయంలో తిరుగుబాటుదారులకు సరుకు చేరవేస్తున్న కెరోలిన్ ఓడను కాల్చి ఈ జలపాతంలో పడివేయబడింది.నయాగరాను దాటటానికి వంతన అవసరాన్ని గుర్తించి 1848లో ఒక వంతెనను నిర్మించి దానికి చార్ల్స్ ఎల్లెట్స్ నయాగరా బ్రిడ్జ్గా నామకరణం చేశారు.1855లో ఈ వంతన స్థానంలో జర్మన్ పూర్వీకంగా కలిగిన జాన్ అగస్టస్ రోయ్‌బ్లింగ్స్చే నయాగరా ఫాల్ల్స్ సస్పెన్‌షన్ బ్రిడ్జ్పునర్నిర్మించబడింది.అమెరికన్ సివిల్ వార్ తరువాత న్యూయార్క్ సెంట్రల్ రైల్ రోడ్ నయాగరా జలపాతం ఉల్లాస యాత్రకు, నూతనదంపతులకు విహారయాత్రకు అనువైనదిగా ప్రకటించి ప్రజాదరణ కలిగించారు.రైల్ ప్రయాణీకుల రద్దీ పెరిగిన తరువాత 1866లో రోయ్‌బ్లింగ్స్ కొయ్య, రాళ్ళతో నిర్మించిన వంతెన స్థానంలో ప్రస్తుతం రైళ్ళును సహితం దాటిస్తున్న స్టీల్ వంతెన లెఫర్ట్ బక్‌చే నిర్మించబడింది.జలపాతం సమీపంలోని మొదటి స్టీల్ ఆర్చ్‌వే బ్రిడ్జ్ నిర్మాణం 1897లో పూర్తి అయింది.అమెరికా కెనడాదేశాలను కలిపే ఈ వంతెన పేరు వైర్ల్ పూల్ రాపిడ్ బ్రిడ్జ్ .ఈ వంతెనపై రైళ్ళు, వాహనాలు, పాదచారులు ప్రయాణం చేయవచ్చు.ఇది కెనడా సరిహద్దు దళాల అధికారపరిమితిలో ఉంటుంది.నయాగరా జలపాతానికి అతి సమీపంలో మూడవ వంతెన రెయిన్ బో బ్రిడ్జ్ 1941 నయాగరా జలపాతం బ్రిడ్జ్ కమిషన్‌చే నిర్మాణం నిర్మించబడింది.ఈ వంతెనద్వారా ఇరుదేశాలప్రజలు అమెరికా, కెనడాల సరిహద్దు పరిశోధనతో ప్రయాణిస్తూ ఉంటారు.మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఆటోమొబైల్స్ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుతో ఇక్కడి పర్యాటకరంగం గణనీయమైన అభివృద్ధిని సాధంచింది.
1969లో యు.ఎస్ ఆర్మీ క్రాప్ ఆఫ్ ఇంజనీర్ల బృందానికి నయగార జలపాతం మూలంలో ఉన్న రాళ్ళను తొలగించాలని ఆడేశాలుజారీ చేయబడ్డాయి. ఈ ఏటవాలు రాళ్ళు అమెరికన్ వైపు జలపాతానికి గుట్టలుగా అడ్డుపదుతున్న కారణంగా ఈ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఇంజనీర్ల బృందం ఈ రాళ్ళను తొలగించి అమెరికన్ వైపు జలపాతానికి ఒరిపిడిని తొలగించడానికి కావలసిన మరమ్మత్తు పనులు చేసారు. జలప్రవాహాన్ని కెనడావైపు మరల్చడానికి 30,000 టన్నుల రాళ్ళను ఉపయోగించి 600 అడుగుల ఎత్తు వరకు ఒక తాత్కాలిక ఆనకట్ట నిర్మించబడింది. ఇంజనీర్లు శిథిలమైన రాళ్ళను తొలగించి సంరక్షా విధానాలను పరీక్షించి ఈ ప్రణాళికను అదే సంవత్సరం నవంబరు నాటికి పూర్తి చేసారు. తాత్కాలిక వంతెన నీటిని నిలువ చేయడానికి సిద్ధం చేయబడింది. 20వ శతాబ్దం చివరి భాగానికి ముందుగా ఉత్తర ప్రవాహం హార్స్ షూ జలపాతం అమెరికన్ వైపు వరుస వంతెనలతో గోట్ ఐలాడ్ తో అనుసంధానించబడి ఉన్న టెర్రియన్ రాక్స్ (తాబేలు రాళ్ళు) చుట్టూ ప్రవహిస్తూ ఉండేది. 1955 నాటికి రాక్స్, గోట్ ఐలాడ్ మధ్య ప్రదేశం నిండి పోయి అక్కడ మంచినీటి తాబేలు కేంద్రం ఏర్పడింది. 1980 ది యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ క్రాప్ ఆఫ్ ఇంజనీర్ల బృందం మరి కొంత భూమిని నింపి మళ్ళింపు ఆనకట్టను నిర్మించి టెర్రియన్ పాయింట్ లో ప్రవాహపు జలం ప్రవేశించకుండా చేయడానికి బలమైన గోడలను నిర్మించారు. కెనెడియన్ వైపున్న 100 అడుగుల హార్స్ షూ జలపాతంతో సహా మొత్తం 400 అడుగుల జలప్రవాహం తీసివేయబడింది.
వాణిజ్యమూ పరిశ్రమలు
[మార్చు]నయాగరా జలపాతం యొక్క అపారశక్తి దీర్ఘకాలం నూడి ప్రముఖ విద్య్దుత్పత్తి వనరుగా గుర్తించబడింది.మొట్టమొదట 1759లో జాన్ కైరీ చిన్న కాలువను నిర్మించి అతని సామిల్ నడపటానికి కావలసిన విద్యుదుత్పత్తి చేయడం ప్రారంభించాడు.ఆ తరువాత 1805లో అగస్టస్ పీటర్ అండ్ పోర్టర్ న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం నుండి జలపాత ప్రాంతాలను కొన్న తరువాత ఇక్కడి కాలువను వెడల్పు చేసి తమ పరిశ్రమకు కావలసిన విద్య్త్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు.1853లో కాగితాలపై రూపుదిద్దుకున్న జలౌత్పత్తి, గనుల పరిశ్రమ ఎట్టకేకలకు 1881 నాటికి జాకబ్ స్కోల్‌కోఫ్ నాయకత్వంలో నిర్మాణపు పనులను పూర్తి చేసుకుని విద్యుదుత్పత్తి ప్రారంబించింది.ఈ ప్రాజెక్ట్ నుండి జలపాతాన్ని, సమీపంలోని ఊరిని ప్రకాశవంతం చేయడానికి కావలసినంత విద్యుత్ విద్యుత్ ఉత్పత్తి కాసాగింది.
నికోలా టెల్సా త్రీ ఫేస్ కరెంట్ పద్ధతిని కనిపెట్టి ప్రత్యామ్నాయ పద్ధతులలో విద్యుతుత్పత్తిని సాధించడంవలన సుదూరతీరాలకు కూడా విద్యుత్తును సరఫరా చేయడం సాధ్యమైంది.న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం నయాగరా జలపాతం సమీపంలో నికోలా టెల్సాకు జ్ఞాపక చిహ్న నిర్మాణాన్ని కావించింది.స్కోల్‌కోఫ్ సంస్థకు చెందిన ఉద్యోగి ప్రత్యామ్నాయ పద్ధతులలో విద్యుదుత్పత్తి చేయడానికి రూపకల్పనకు అనుకూలంగా జార్జ్ వెస్టింగ్ హౌస్ ను బాడుగకు తీసుకోవడం వెస్టింగ్ హౌస్ ఆధ్వర్యంలో ప్రపంచపు తొలి ఎసి విద్యుత్ ఉత్పత్తి వినియోగం చేయడానికి పునాది వేసింది.టెల్సా, ఎలెల్ నన్ శక్తివంతంగా 5% కంటే తక్కువ నష్టంతో రెండు మైళ్ళ దూరం వరకూ ఎసి విద్యుత్ సరఫరా చేయవచ్చని నురూపించారు.1896లో నాలుగు సంవత్సరాల అనంతరం జెపీమోర్గన్,జాన్ జాకబ్ అస్టర్ ఐవి, వాడర్ బుల్ట్స్ ఆర్థిక సహాయంతో వారు భూఅంతర్భాగ 1,00,000 అశ్వశక్తి (హార్స్ పవర్)విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు.ఈ ప్రాజెక్ట్ సాయంతో విద్యుత్తును 20 మైళ్ళ దూరంలో ఉన్న బఫెల్లో సిటీ వరకు విద్యుత్ సరఫరా చేసే శక్తిని సాధించారు.స్విజ్ సంస్థ ఫీచ్ అండ్ పిక్కర్డ్ ఈ ప్రాజెక్ట్కు కావలసిన సాంకేతిక సహాయం చేసింది.
కెనడా దేశానికి చెందిన ప్రైవేట్ రంగ సంస్థలూ నయాగరా జలపాతం నుండి జలవిద్యుదుత్పత్తిని చేయడం ప్రారంభించాయి.చివరికి 1906లో కెనడా ప్రభుత్వం ప్రాజెక్టును కొనుగోలు చేసి ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకువచ్చి వివిధ పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయసాగింది. 50%నుండి 75% నయాగరా నదీ ప్రవాహం టన్నెల్స్ (భూ సొరంగం)ద్వారా ప్రవహింపచేసి జలవిద్యుదుత్పత్తి చేసి అమెరికా, కెనడా దేశాల పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
1961 లో నయాగరా జలవిద్యుత్తు కేంద్రం ఉత్పత్తి ప్రాంరంభం చేసిన తరువాత పడమటిదేశాలలో బృహత్తర జలవిదుత్తు కేంద్రంగా గుర్తించబడింది. ప్రస్తుతం నయాగరా 2.4 గిగాబైట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ న్యూయార్క్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంది. సెకనుకు 375, 000 యు.ఎస్ గ్యాలన్ (1,420 ఘనపు మీటర్లు) జలాన్ని నయాగరా నది నుండి నయాగరా జలపాత నగరం కింద నుండి పైపుల ద్వారా ల్యూవిస్టన్, రాబర్ట్ మోసెస్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు మళ్ళిస్తున్నారు. తరువాత ఊఈ జలం హైడ్రాలిక్ టర్బైన్ల ద్వారా ప్రవహింపజేసి తయారు చేస్తున్న విద్యుత్తును సమీపము లోని కెనడా, అమెరికా లోని ప్రాంతాలకు సరఫరాజేస్తున్నారు. ఈ జలవిద్యుత్తు ఉత్పత్తి టర్బైన్లు యంత్రశక్తిని విద్యుత్తు శక్తిగా మార్చుతున్నాయి. ఎప్పుడైతే విద్యుత్తు ఉత్పత్తి అవసరం తక్కువగా ఉన్నప్పుడు ల్యూవిస్టిన్ కేంద్రాలు పైపులుగా మారి దిగువకు ప్రవహింపజేసి జలాన్ని ప్లాంటు రిజర్వాయరుకు చేరుస్తారు. ఈ జలాన్ని తిరిగి అత్యధికంగా విద్యుత్తును ఉపయోగించే పగటి వేళాలలో ప్లాంటుకు పంపిస్తారు. విద్యుత్తు అవసరం శిఖరాగ్రానికి చేరుకునే పగటి సమయంలో ఇదే ల్యూవిస్టన్ పపులు వెనుకకు తిప్పి తిరిగి మోసెస్ ప్లాంతు మాదిరిగా విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంగా పని చేయిస్తారు.
నయాగరా అందాలను సంరక్షించే విధంగా అమెరికా, కెనడాలు 1950 లో ఒక ఒప్పందం మీద సంతకం చేసాయి. ఈ ఒప్పదం వేసవి రాత్రులలో పర్యాటకులు తక్కువగా ఉండే సమయంలో అలాగే పర్యాటకులు అతి తక్కువగా ఉండే శీతాకాలం జలాన్ని మళ్ళించడానికి అనుమతిస్తుంది. ఈ ఒప్పదం జలపాతంలో నిరంతర జలతెరను (అన్ బ్రోకెన్ కర్టెన్ ఆఫ్ వాటర్) కల్పిస్తూ జలం ప్రవహించే నమ్మకం కలిగించేలా రూపొందించబడింది. పర్యాటకులు అధికంగా ఉండే పగటి వేళలలో జలపాతం నుండి ఒక సెకనుకు 100,000 ఘనపు అడుగుల (2,800 ఘనపు మీటర్లు)నీరు ప్రవహిస్తుంది. అలాగే రాత్రి వేళలో ఒక సెకనుకు 50,000 ఘనపు అడుగుల (1,400 ఘనపు మీటర్ల) నీరు ప్రహించబడుతుంది. ఈ ఒప్పందాన్ని అంతర్జాతీయ నయాగరా కంట్రో బోర్డ్ ద్వారా నిర్వహించబడుతుంది. శీతాకాలంలో పవర్ అధారిటీ ఆఫ్ న్యూయార్క్ ఒంటారియా పవర్ జనరేషన్ తో కలిసి పనిచేసి నయాగరా నది మీద మంచు గడ్డకుండా ఆపే ప్రయత్నాలు చేస్తారు. ఇందువలన విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం కలగడం, సముద్రతీర ఆస్తులు వరదలో మునగడం వంటి ఇబ్బందులు కలగకుండా నిరోధించబడుతుంది. వారి ఉమ్మడి ప్రయత్నాల వలన 8,800-అడుగుల (2,700 మీటర్ల) దీర్ఘకాల హిమపాతం సమయంలో మంచుగడ్డకట్టుకుని దిగువ ప్రాంతంలోని విద్యుత్తు కేంద్రాలకు నీటి ఫరఫరా ఆగకుండా కాపాడింది.
నయగరా నది పై ఉన్న అత్యంత శక్తివంతమైన జలవిద్యుత్ కేంద్రం కెనడా దేశంలోని సర్ ఆడమ్ బెక్ 1 అండ్ 2, రాబర్ట్ మోసెస్ నయగరా పవర్ ప్లాంట్, అమెరికా వైపున్న లెవిస్టన్ పంప్ జనరేటింగ్ ప్లాంట్. నయాగరా విద్యుదుత్పత్తి శక్తి మొత్తం 4.4 ఉంటుంది. ఇందుకు సాంకేతిక సహాయం అందించిన ఘనత ఎడ్వర్డ్ డీన్ ఆడమ్స్‌కు చెందుతుంది .2005 ఆగస్టులో సర్ ఆడమ్ బెక్ సంస్థల బాధ్యతలు స్వీకరించిన ఒంటారియా పవర్ జెనరేషన్ ప్లాంట్6.5 మైళ్ళ సొరంగనిర్మాణాన్ని విద్యుతుత్పత్తి కోసం నిర్మించనున్నట్లు ప్రకటించింది.ఇది 2009 నాటికి నిర్మాణపు పనులను పూర్తి చేసుకుని సర్ ఆడమ్ బెక్ విద్యుదుత్పత్తి శక్తిని 182 మెగా వాట్స్‌కు పెంచవచ్చని భావిస్తున్నారు.
రవాణా సౌకర్యాలు
[మార్చు]1950 నుండి నయాగరా జలపాతం నుండి నౌకలను ఉపమార్గంలో నడిపించడానికి వెల్‍లాండ్ కలువను డ్భివృద్ధి చేసి సెయింట్ లారెంస్ సముద్ర మార్గంలోకి విలీనం చేయబడింది. బఫెల్లో టౌన్ నుండి దారి మళ్ళించబడిన సముద్రమార్గం సమీపంలోని ఉక్కు, ధాన్యపు మిల్లులు ఇతర నయాగరా నది వలన ఉత్పత్తి చేయబడుతున్న విద్యుత్తుతో సుసంపన్నమైన పరిశ్రమల కాలుష్యంతో మరణావస్తకు చేరుకుంది. ఏదిఏమైనప్పటికీ 1970 నుండి ఈ ప్రదేశం ఆర్థికంగా క్షీణదశలో పయనిస్తుంది.
నయాగరా జలపాత నగరాలైన ఒంటారియో, కెనడా, నయాగరా జలపాతం, న్యూయార్క్ రెండు అంతర్జాతీయ వంతెనలద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. ది రెయిన్ బో బ్రిడ్జ్ జలపాతం నుండి సమీపంలోని దిగువ నదీపై నిర్మించబడి ఉంది. జలపాతాన్ని సమీపదూరం నుండి చూడడానికి వీలుగా ఉన్న ఈ వంతెన వాణిజ్య ప్రయోజనం లేని వాహనాలను, పాదచారులను అనుమతిస్తుంది. ది వైర్ల్ పూల్ రాపిడ్స్ బ్రిడ్జ్ ది రెయిన్ బో బ్రిడ్జ్ కు ఉత్తరదిశలో ఒక మైలు దూరంలో ఉంది. ఇది నయాగరానది మీద నిర్మించబడిన పురాతన వంతెనగా భావిస్తున్నారు. సమీపంలో ఉన్న నయాగరా జలపాతం అంతర్జాతీయ విమానాశ్రయం, బఫెల్లో నయాగరా జలపాతం అంతర్జాతీయ విమానాశ్రయాలకు జలపాతం పేరును స్థిరీకరించారు. అలాగే నయాగరా విశ్వవిద్యాలయం, లెక్కించ శక్యం కాని వ్యాపారాలు, ఒక ఆస్ట్రాయిడ్ లు కూడా ఈ పేరుతో వ్యవహరించబడుతున్నాయి.
సంరక్షణా ప్రయత్నాలు
[మార్చు]నయాగరా జలపాతం రచయితల,కళాకారులకు,పరిశోధకులకు,చలన చిత్రతయారీ దారులకు విద్యుత్‌చ్చక్తి ఉత్పత్తిదారులకు ప్రేరణ కలిగిస్తూ తనవైపు ఆకర్షిస్తూ ఉంటుంది.ఇక్కడి జలపాత సౌందర్యం అంతర్జాతీయ పర్యాటకులను సహితం ఆకర్షిస్తుంటాయి.1870 వరకు పర్యాటకకేంద్రంగా మాత్రమే ఉన్న నయాగరా ఆతరువాతి కాలంలో వాణిజ్యపరమైన అవసరాలకోసం ఆకర్షించడం మొదలైంది.వాణిజ్యపరమైన విద్యుత్తయారీకి గోట్ ఐలాం,డు రూపం మారిపోసాగింది.యుఎస్ కనసర్వేషన్ మూవ్‌మెంట్ సమయంలో సామాన్య ప్రజలు నయాగరాకు వచ్చి స్థిరపడటం మొదలైంది.హడ్సన్ రివర్ స్కూల్ కళాకారుడుఫెడరిక్ ఎడ్విన్ చర్చ్,ఫెడరిక్ లా ఆల్మ్‌స్టెడ్ , కళాకారుడు హెన్రీ హబ్‌సన్ రిచర్డ్‌సన్ లాంటి ప్రముఖులూ వీరిలో ఉన్నారు.చర్చ్ అప్పటి కెనడా దేశ గవర్నర్‌జనరల్ లార్డ్ డ్యూఫరిన్దగ్గరకు వెళ్ళి పబ్లిక్ పార్క్ నిర్మాణానికి కావలసిన అంతర్జాతీయ చర్చలు జరపాలని ప్రతిపాదించాడు.
అమెరికన్ భాగంలోని గోట్ ఐలాండ్ పునరుద్దరణకు ఆ చర్చలు నాంది పలికాయి. విలియం డార్షిమర్ ఈ ద్వీపదృశ్యం నుండి బదిలీ అయింది. ఓల్మ్‍స్టీడ్ వృత్తి జీవితంలో గుర్తింపు తెచ్చిన సిటీ పార్క్ రూపకల్పన చేయడానికి 1868లో ఓల్మ్‍స్టీడును బఫెల్లో టౌన్ కు పిలించారు. తరువాత 1879లో న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ ఈ పని కొరకు ఓల్మ్‍స్టీడ్, జేంస్ టి. గార్డనర్ ను పార్కును పరిశీలించి నయాగరాను సంరక్షించడానికి ముఖ్యమైన దస్తావేజు తయారు చేసి నివేదిక తయారు చేయడానికి నియమించింది. ఈ నివేదిక రాష్ట్రం నయాగరా జలపాత పరిసరాలను కొనుగోలు చేసి పునరుద్ధరించి అలాగే సంరక్షించడానికి కావలసిన వాదనలను సమర్పించింది. నయాగరా జలపాత పాత అందాలను పునరిద్ధరించడం "మానవజాతికి పవిత్రమైన బాధ్యత"గా అభివర్ణించబడింది. 1883 గవర్నర్ క్లేవ్ లాండ్ కార్యాలయం నయాగరా, నయాగరా అసోసియేషన్ నుండి భూములను సేకరణలకు అనుమతి ఇస్తూసాసనం జారీ జేసింది. 1882లో ప్రభుత్వేతర పౌరుల సంఘం రూపుదిద్దుకుని ఒక గొప్ప లేఖలను వ్రాసే ఉద్యమం చేపట్టి పార్కును బలపరుస్తూ పిటిషన్ తయారు చేసింది. న్యూయార్క్ గవర్నర్ అలాంజో కార్నెల్ ఈ ఉద్యమాన్ని వ్యరేకిస్తున్న అదే సమయంలో ప్రొఫెసర్ చార్లెస్ ఎలియాట్ నార్టన్, ఓల్మ్‍స్టీడ్ ఈ ప్రజా ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించారు.
1885 ఏప్రిల్ 30 న గవర్నర్ డేవిడ్ బి.హిల్ నయాగరా రిజర్వేషన్, న్యూయార్క్ మొదటి రాష్ట్రీయ ఉద్యానవనం శాసనాన్ని చేసి దాని మీద సంతకం చేసిన తరువాత ఈ ప్రయత్నాలకు తగిన సత్కారం లభించింది. నయాగరా చార్టర్ స్టేట్ పార్క్ కొరకు వ్యాపారసంస్థల నుండి భూమిని సేకరించడం ప్రారభం అయింది. అదే సంవత్సరం ఒంటారియా అదే అవసరం కొరకు క్వీన్ విక్టోరియా నయాగరా ఫాల్స్ పార్కును రూపొందించింది. కెనెడా వైపు లేక్ ఎఋఋఇ, లేక్ ఒంటారియా వరకు ఉన్న నయాగరా నదీతీర భూములు నయాగరా పార్క్ కమిషన్ నిర్వహణలో ఉన్నాయి. 1887 లో, ఒల్మ్స్టెడ్, కాల్వర్ట్ వాక్స్ జలపాతం పునరుద్ధరించడానికి ప్రణాళికలను వివరించే ఒక అనుబంధ నివేదికను విడుదల చేసింది. నయాగరా జలపాతం చుట్టూ ఉన్న పరిసరాలలో అధికమైన మార్పులు జరుగకుండా సహజ సిద్ధమైన సఒందర్యాన్ని పునరిద్ధరించి రక్షించాలన్నది వారి ఉద్దేశం. సంరక్షణా విధానాలు జలపాత అందాలు పాడవకుండా ఉంచడమెలా ? మానవుల చేత దెబ్బతింటున్న భాగాలను పునరుద్ధరించడం ఎలా ? వారు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ నడిచేలా కాలిబాటలు, అక్కడక్కడా విశ్రాంతి మందిరాలు ఉండేలా అదే సమయం పరిసరాలను చెడగొట్టకుండా ఉండేలా పర్యాటకులకు ఆనందం కలిగించేలా ఒక ఉద్యానవనాన్ని రూపొందించారు. తరువాత స్మారక శిల్పాలు, అంగళ్ళు, హోటళ్ళు, గ్లాస్ అండ్ మెటల్ సందర్శన గోపురం (1959) లో అదనంగా చేర్చారు. ఓల్మ్ స్టండ్ కావ్యదృష్టి, నిర్వహణా వాస్తవాలను సమతుల్యం చేస్తూ ఈ సంరక్షణా విధానాలు కొనసాగాయి.
20 వ శతాబ్దం వరకూ సంరక్షణా విధానాలు కొనసాగాయి. జె. హోరేస్ మెక్ఫార్లాండ్, సియెర్ర క్లబ్, అప్పలచియన్ పర్వత క్లబ్ నయాగరా నదీ జలాల మళ్ళింపును 1906లో యునైటెడ్ నేషన్స్ కాంగ్రెస్ ను క్రమబద్ధీకరించి నయాగరా జలపాతాన్ని సంరక్షించే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఒప్పించారు. ఈ చట్టం నయాగరా నదీజలాల క్రమబద్ధీకరణకు కెనిడియన్ ప్రభుత్వ సహకారాన్ని కోరింది. ఫలితంగా 1909లో కుదిరిన ఒప్పందం కారణంగా జలపాతం నుండి రెండు దేశాలకు మొత్తం ఒక సెకనుకు 56,000 ఘనపు అడుగుల జలాలను మళ్ళించడానికి అనుమతి లభించింది. ఈ పరిమితి 1950 వరకు శక్తి వంతంగా కొనసాగింది.
భూ ఊచకోతా ప్రయత్నాలు కూడా ఎప్పుడూ అత్యంత ముఖ్యత్వం సంతరించుకున్నాయి. దిగువజలాల ఆనకట్టలు ప్రస్తుతం చాలా దీనావస్థలో ఉన్నాయి. జలపాతం ఎగువ తీరాలు కూడా బలపరచవలసిన అవసరం ఉంది. 1969 జూన్ మాసం నుండి కొన్ని నెలపాటు నయాగరా నదీజలాలను అమెరికన్ వైపు జలపాతం ప్రవహించకుండా పూర్తిగా మళ్ళించారు. అప్పుడు రాళ్ళు, మట్టితో కలిపిన ఆనకట్ట నిర్మాణపు పనులను చేపట్టారు. హార్స్ షూ జలపాతం మరింత జలాన్ని గ్రహిస్తున్న సమయంలో యు.ఎస్ ఆర్మీ క్రాప్ నదీ ప్రవాహిత ప్రదేశాన్ని పరిశీలిస్తూ ప్రవాహాలకు యాంత్రికంగా అడ్డుకట్ట వేసి అంతముకు ముందు సరిదిద్దబడని లోపాలను కనిపెట్టి లోపాలను త్వరిత గతిని సరిదిద్దారు. 1954లో ఏర్పడి అప్పటి వరకు ఖర్చుకు వెరసి విసర్జించిన అతిపెద్ద రాతిశిథిలాల గుట్టను ఎత్తి వేయడానికి ప్రణాళికను రూపొందించారు. 1969లో తత్కాలిక ఆనకట్టను డైనమైట్ల సాయంతో తొలగించి అమెరికన్ జలపాతంలోకి తిరిగి నీటిని వదిలారు. ప్రధాన జలపాతం, బ్రైడల్ జలపాతం మధ్య ఉన్న చిన్న ద్వీపమైన ల్యూనా ఐలాడ్ లో అది బలహీనంగా ఉందని నీటిలో మునిగి పోయే ప్రమాదం ఉందని భయపడి సాధారణ ప్రజలకు ప్రవేశ అనుమతిని నిలిపివేసారు.
రాష్ట్రీయ ఉద్యానవనం పరిసర ప్రాంతాలలో వ్యాపారపరమైన ఆసక్తితో ఆక్రమణలు కొనసాగాయి. కెనడా వైపు నిర్మించబడిన ఆకాశసౌధాలు వాటిలో కొన్ని. అవి చాలా వరకు పర్యాటకుల కొరకు నిర్మించిన వసతి గృహాలే. గ్యూల్ఫ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు స్చ్కేల్ మోడలును ఉపయోగించి కెనడా వైపు నిర్మించిన ఆకాశ సఒధాలనుండి మరలిన గాలులు దక్షిణ తీరాన ఉన్న భవనాలనుండి జలపాతం వైపు మళ్ళుతున్న కారణంగా జలపాతం నుండి ఎగసిపడుతున్న నీటి తుంపరలు అధికమై పొగమంచు కురిసే దినాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు. 1996లో 26గా నమోదైన పొగమంచు కురిసే రోజులు 2003 నాటికి 68 చేరుకోవడం ఈ వాదనకు బలం చేకూర్చినా మరొక పరిశోధన మాత్రం ఈ వాదనను బలహీనపరుస్తూ గాలి, నీటిలో సంభవించే ఉష్ణోగ్రతలో మార్పులే ఇందుకు కారణమని వాదించాయి. ఏది ఏమైనప్పటికీ ఈ వాదనలు పొగమంచు కురిసే రోజులు ఎందుకు అధికమైయ్యాయో సరిగా నిర్ధారించ లేక పోయాయి.
జలపాతం గురించిన విషయాలు
[మార్చు]1829 అక్టోబరు ది యాంకీ లీప్స్టర్ అని తనకు తానే పిలుచుకునే శాం పాచ్ జలపాతం పైభాగాన్నుండి కిందకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుండి సాహసవీరులు ఈ జలపాతం నుండి కిందకు దూకే సాహసం ఒక సంప్రదాయంగా మారింది.
ఎగురుట, మునుగుట
[మార్చు]1901 అక్టోబరు 24 న 63 సంవత్సరాల మిచిగాన్ స్కూల్ లో పనిచేసిన టీచర్ అన్నీ ఎడ్సన్ టైలర్ తన ప్రకటనా యుద్ధంలో ఒక భాగంగా ఒక పీపాలో నుండి ఈ జలపాతం నుండి కిందకు దూకింది. ఆమె కొంత రక్త స్రావంతో కూడిన గాయాలతో ప్రాణాలతో బయట పడింది అయినప్పటికీ ఎలాంటి తీవ్రమైన హాని జరగలేదు. పీపా నుండి వెలుపలికి రాగానే ఆమె " ఎవరూ తిరిగి ఇలాంటి ప్రయత్నాలు చేయలేరూ" అని చెప్పింది. టైలర్ ప్రయత్నానికి ముందు అక్టోబరు 19న లగారా అనే పెంపుడు పిల్లిని హార్ష్ షూ జలపాతం మీదుగా దాని శక్తిని పరీక్షించడానికి పీపాలో ఉంచి కిందికి పంపారు. ఆ సమయంలో ఆ మునక నుండి ఆ పిల్లి బ్రతికి భయపడిందనడంలో వివాదస్పదమైన పుకార్లు తలిత్తినా తరువాత ఆ పిల్లి టైలర్ తో చాయాచిత్రాలలో నిలిచింది. టైలర్ చారిత్రాత్మక ప్రదర్శన తరువాత అంతర్జాతీయంగా 14 మంది ప్రజలు ఈ విధంగానూ ఇతర ఉపాయాలను ఉపయోగించి జలపాతం నుండి కిందికి దూకారు. కొందరు హాని లేకుండా బయట పడినా కొందరు మునిగి పోయారు మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సాహసకృత్యాల నుండి ప్రాణాలతో బయట పడిన వారు తరువాత ఆరోపణలను, జరిమానా విధింపులను ఎదుర్కొన్నారు. వాస్తవంగా రెండు వైపులా జలపాతం నుండి కిందకు దూకే ప్రయత్నాలు చేయడం చట్ట విరోధమైనది.
- 1918లో నయాగరా స్కో (బార్జ్) అనే యంత్రం నది పైభాగంలో పనిచేస్తున్నప్పుడు దాని ముందు భాగం విరిగి పై నుండి కిందికి వేలాడింది. అందులో ఉన్న ఇద్దరు ఆ యంత్రాన్ని జలపాతం చివరి భాగం వరకు వచ్చిన తరువాత ఆపి తమను తామే రక్షించుకున్నారు.
- 1883 లో ఇంగ్లీష్ చానల్ ను దాటిన మొదటి ఆంగ్లేయుడు ఈ జలపాతం దిగువ నుండి ఈ దుతూ దురదృష్ట వశాత్తు మునిగి పోయాడు.
- మిరాకిల్ ఎట్ నయాగరా (నయాగరా వద్ద అద్భుతం) అని వర్ణింపబడే ఏడేళ్ళ బాలుడు రోజర్ వుడ్ వార్డ్ హార్షూ షూ ఫాల్స్ నుండి పడినప్పుడు లైఫ్ జాకెట్ సహాయంతో మాత్రమే రక్షించబడ్డాడు. 17 సంవత్సరాల అతడి సోదరి గోట్ ఐలాండ్ సమీపంలో హార్ష్ జలపాత్యానికి 20 అడుగుల ముందు ఇతర పర్యాటకుల సాయంతో రక్షించబడింది. తరువాత కొన్ని నిముషాల తరువాత ఆ బాలుడు కిందకు జలప్రవాహంతో నెట్టివేయబడ్డాడు. మిండ్ ఆఫ్ ది మిస్ట్ బోట్ బృందం అతడికి ఒక లైఫ్ రింగును అందించడం ద్వారా అతడిని రక్షించారు.
- 1984 జూలై 2 హామిల్టన్ నుండి కెనడియన్ కారెల్ సౌస్క్, హామిల్టన్, ఒంటారియో హార్స్ షూ జలపాతం నుండి పీపాలో ఉండి విజయవంతంగా కిందకు దూకి స్వల్పమైన గాయాలతో బయటపడ్డాడు. ఈ సాహసకృత్యం ప్రభుత్వ అనుమతి లేకుండా చేసినందుకు 500 అమెరికన్ డాలర్ల జరిమానా విధించారు. 1985లో ఆయన హస్టన్ ఆస్ట్రోడాం సమీపంలో నయాగరా డ్రాప్ వద్ద ఎగిరుతున్న గాలిగుమ్మటం నుండి పీపాలో ఉండి 180 అడుగుల కింద ఉన్న నీటితొట్టిలోకి దూకే ప్రయత్నంలో విపరీతంగా గాయపడ్డాడు. ఆయన పీపా విడుదల చేయగానే అది నీటితొట్టి గోడలకు గుద్దుకున్నది. మరునాడు గాయాలకారణంగా ఆయన మరణించాడు.
- 1985లో రోడెల్ ద్వీప వాసి స్టెవ్ టార్టర్ (22 సంవత్సరాలు) ఈ జలపాతం నుండి దూకిన అత్యంత పిన్నవయస్కుడుగా గుర్తింపు పొందాడు. అలాగే 25 సంవత్సరాలలో ఈ సాహసకృత్యం చేసిన మొదటి అమెరికన్ గా గుర్తింపు పొందాడు. పది సంవత్సరాల తరువాత తిరిగి టార్టర్ ఈ సాహసం చేసి జలపాతం నుండి రెండుమార్లు దూకిన రెండవ వ్యక్తిగా గుర్తింపు పొందాడు. టార్టర్ తో లోరీ మార్టిన్ కలవడంతో ఇది రెండవ జంటగా సాహసంగా కూడా గుర్తింపు పొందింది. వారు ప్రాణాలతో బయటపడినా వారి పీపా జలపాతం అడుగు భాగానికి తగిలడం వలన రక్షణబృందం వారి సహాయం కావలసి వచ్చింది.
- 1889 సెప్టెంబరు 28 నయాగరా వాసి పీటర్ డీబర్నడి (42 సంవత్సరాలు), జఫరీ జేంస్ పెట్కోవిచ్ (25సంవత్సరాలు) ఈ జలపాతం నుండి ఒకే పీపాలో ఉండి జంటగా కిందకు దూకి ఒకే పీపా ద్వారా దూకిన జంటగా గుర్తింపు పొందారు. ఆయన యువకులను మాదకద్రవ్యాలకు బానిసగా కాకుండా కాపాడడానికి ఈ సాహసకృత్యం రూపకల్పన చేసాడు. అలాగే పీటర్ తన రెండు సంవత్సరాల కుమారుడైన కైల్ లహేయ్ డీబర్నడి మాదకద్రవ్యాలకు బానిసత్వం వారసత్వం కాకుండా ఉండడానికి ఈ సాహసకృత్యానికి పూనుకున్నాడు. వాస్తవానికి
పీటర్ డీబర్నడి ఈ సాహస కృత్యం చేయడానికి ముందుగా వేరొకరిని ఎంచుకున్నాడు. కాని ఆయన దీని నుండి తప్పుకొన్న తరువాత పీటర్ వేరొకరిని ఎంచుకొనవలసిన అవసరం ఏర్పడిన కారణంగా జఫరీ జేంస్ పెట్కోవిచ్ చేర్చుకుని ఈ సాహసకార్యం చేసాడు. ఈ సాహస కృత్యం చేయడానికి ఆయన 30,000 అమెరికన్ డాలర్లు ఖర్చు చేసాడు. ఈ పీపాను స్టీలు, ఫైబర్ గ్లాసుతో తయారు చేసి దానికి తొడుగులు తయారు చేసి వాటిని స్టీలు బెల్టులతో బంధించాడు. ఈ పీపాలో వెలుపలికి చూడడానికి కేంద్రాలు, సంగీతం కోసం రేడియో, వార్తా నివేదికలు, పీపా కిందకు పడుతున్న సమయంలో సహకరించే మార్గదర్శకాలు, ఆక్సిజన్, అలాగే ఈ కార్యక్రమం చిత్రీకరించడానికి సురక్షితమైన వీడియో కెమేరాలు ఉన్నాయి. వారు కిందకు దూకిన వెంటనే స్వల్ప గాయాలతో వెలుపలికి వచ్చారు. అయినప్పటికీ తగిన అనుమతి లేకుండా ఈ సాహసం చేసినందుకు నయాగరా చట్టం కింద ఆరోపణలను ఎదుర్కొన్నారు.
- 1993 సెప్టెంబరు 27లో జాన్ డేవిడ్ ముండే, కైస్టర్ సెంటర్, ఒంటారియో. ఈజలపాతం నుండి రెండు మార్లు కిందకు దూకి ప్రాణాలతో బయట పడిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు.
- 2003 అక్టోబరు20 కిర్క్ జోంస్ కాంటన్, మిచిగాన్ హార్స్ షూ జలపాతం నుండి ఎటువంటి సురక్షితమైన ఏర్పాటు లేకుండా కిందకు దూకి సురక్షితంగా బయటపడిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఇది ఆత్మహత్యా ప్రయత్నంగా ఇప్పటికీ భావిస్తున్నారు.
- 2009 మార్చి 11 సురక్షితంకాని ప్రయాణం వలన జలపాతం నుండి కిందకు దూకినా రక్షణబృందం వారిచే రక్షించబడ్డాడు. అయినప్పటికీ ఆయన అల్పోష్ణ స్థితి, తల మీద బలమైన గాయాలా పాలయ్యాడు. ఆయన ఎవరో గుర్తించబడ లేదు. అక్కడ ఉన్న సాక్ష్యులు మాత్రం ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే జలపాతం లోకి ప్రవేశించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
- 2012 మే 12 40 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి సురక్షిత విధానాలు లేకుండా జలపాతం నుండి కిందకు దూకి ప్రాణాలతో బయటపడిన వ్యక్తిగా నమోదయ్యాడు.
నడక
[మార్చు]ఇతర సాహస వీరులు జలపాతం ఒక తీరం నుండి మరొక తీరానికి తాటి మీద నడచి చేరాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. 1859లో జీన్ ఫ్రాంకోయిస్ బ్లోడిన్ గ్రేవ్లెట్ నయాగరా గోర్జ్ను విజయవంతంగా దాటాడు. 1859-1859 ల మధ్య వైర్ మీద వడిచే విన్యాసం మీద మోహం అధికంగా ఉండేది. జలపాతం ముందు భాగాన నది పైభాగాన వైరు మీద నడిచే ఈ విన్యాసం తరచుగా జరుగుతుండేవి. అనుభవం లేని వాకర్ తన సేఫ్టీ రోప్ నుండి జారాడు. ఒకే ఒక మనిషి మాత్రం కింద పడి మరణించాడు. అతడు ఆంకోరింగ్ ప్రదేశం వద్ద రాత్రివేళ అనుమానాస్పద పరిస్థితుల మధ్య తన తీగ నుండి కిందకు పడి మరణించాడు.
ఈ టైట్ రోప్ వాకర్లు వారి సాహసం చేసే సమయంలో సాక్ష్యంగా అత్యధిక మైన జనసందోహాన్ని ఆకర్షిస్తున్నారు. వారి తీగలు గోర్జ్ కు అడ్డంగా ప్రస్తుత రైంబో బ్రిడ్జ్ సమీపంలో ఉంటాయి. ఉంటాయి. ఇలాంటి సాహస వీరులు అనేక మందిలో తనకు తానే ది గ్రేట్ ఫరిని చెప్పుకునే విలియం హంట్ బ్లాండిన్ తో పోటీ పెట్టుకుని తీవ్రమైన సాహసాలు చేసాడు. మూడు ప్రత్యేక సందర్భాలలో బ్లాండిన్ తన మేనేజర్ హర్రీ కలర్ ను తన వీపు మీద కూర్చోబెట్టుకుని చివరిసారిగా ప్రింస్ ఆఫ్ వేల్స్ వీక్షిస్తుండగా ఈ విన్యాసం చేసాడు.
1876 లో ఇటలీకి చెందిన మరియా స్పెల్టర్నీ అనే మహిళ టటి రోప్ మీద ఈ విన్యాసం చేసింది. ఆమె ఈ విన్యాసం చేసిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది. ఆమె ఇక్కడ 18 రోజులలో నాలుగు మార్లు ఈ విన్యాసం ప్రదర్శించింది. జూలై 12న కాళ్ళకు పీచ్ బాస్కెట్లను పెట్టుకుని, జూలై 19న కళ్ళకు గంతలు కట్టుకుని, జూలై22 చీలమండలం, పిడికిళ్ళు ఉపయోగించి అలాగే చివరిగా జూలై 26న ఈ విన్యాసం చేసింది. ఆమె తిరిగి నయాగరాలో ఎప్పడూ చేయలేదు. ఆమె వ్యక్తిగత జీవితం మర్మమైనదిగా ఉండేది. అలాగే ఆమె మరణించి న తేదీ, ప్రదేశం తెలియకుండా ఉండి పోయింది. జేంస్ హార్డ్లీ ఈ విన్యాసం ప్రదర్శించిన తరువాత 1896 నుండి టైట్ రోప్ దాటే విన్యాసం చట్టపరంగా నిషేధించబడింది.
2012 జూన్ 15 హై వై కళాకారుడు నిక్ వాలెండా 116 సంవత్సరాల తరువాత రెండు ప్రభుత్వాల నుండి అనుమతి తీసుకుని ఈ విన్యాసం ద్వారా జలపాతం దాటిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఆయన టైట్ రోప్ పొడవు మొత్తం 1,800 అడుగులు. వాలెండా బ్రింక్ సమీపంలో హార్స్ షూ జలపాతం వద్ద ఈ విన్యాసం ప్రదర్శించాడు.
ఇతర ఆకర్షణలు
[మార్చు]చలన చిత్రాలు
[మార్చు]ఇప్పటికే అనేకమంది పర్యాటకులను ఆకర్షణ, హనీమూన్ దంపతులకు అభిమాన ప్రదేశం అయిన నయాగరా జలపాతం పర్యాటకులు 1953లో మార్లిన్ మన్రో, జోసెఫ్ కాట్టన్ నటించిన నయాగరా చలనచిత్రం విడుదల అయినప్పటి నుండి మరింత పెరిగింది. తరువాత 20వ శతాబ్దంలో 1980 చిత్రమైన సూపర్మాన్ II లో నయాగరా దృశ్యాలు చోటుచేసుకున్నాయి అలాగే అది ఐమాక్స్ చిత్రంగా కూడా ప్రజాదరణ పొందింది. నయాగరా అపోహలు, మంత్రజాలం కూడా ప్రజాదరణ పొందాయి. 1987 నాటి టీనేజ్ ముటాంట్ నింజా తాబేళ్లు కార్టూన్ సీరియల్ సాంకేతిక సమాహారం నయాగరా జలపాతం, హైడ్రో ఎలెక్ట్రిక్ ప్లాంట్ వద్ద చిత్రీకరించబడింది. 1990లో భ్రమనిపుణుడు (ఇల్యూషనిస్ట్) డేవిడ్ కాపర్ ఫీల్డ్ తాను హార్స్ షూ జలపాతం మీద ప్రయాణం చేస్తున్నట్లు భ్రమకలిగించేలా ఒక యుక్తిని ప్రదర్శించాడు. 2004లో జలపాతానికి సమీపంలో ఉన్న పర్యాటక కాంప్లెక్స్ కొంతకాలం ఇక్కడ వండర్ ఫాల్స్ అనే టెలివిజన్ షో ప్రదఋసనకు ఏర్పాటు చేసారు. 2006లో అతి సమీపకాలంలో జలపాద పాదం వద్ద వరల్డ్స్ ఎండ్ అనే చిత్రం చిత్రీకరించబడింది.
సంగీతం
[మార్చు]1960లో నయాగరా జలపాతం విద్యుదుత్పత్తి ప్రణాళిక వారు వారి హైడ్రో ఎలెక్ట్రిక్ పని మొదటి స్థాయి పని పూర్తి అయిన సందర్భాన్ని గౌరవిస్తూ సంగీతదర్శకుడు ఫెర్డే గ్రోఫ్ ను నయాగరా ఫాల్స్ సూట్ సంగీత కూర్పు కొరకు నియమించారు. వాటిని జలపాతానికి గ్రేటర్ బఫెల్లో చరిత్రకు అంకితమిచ్చారు.
సాహిత్యం
[మార్చు]హెచ్ గి వెల్స్ నవల వార్ ఇన్ ది ఎయిర్ చిత్రంలో జర్మన్ ఏరియల్ దాడిలో నయాగరా బేస్ కేంపుగా వర్ణించబడింది.
జలపాత మంత్రముగ్ధతకు మైమరచిన అనేక మంది కవులు జలపాతం గురించి వర్ణించి తమ కవిత్వంలో వ్రాసారు. వారిలో గుర్తించతగిన వారు క్యూబన్ కవి హెరెడియా, ఆయన ప్రముఖ ఓడే నయాగరాలో ఈ వర్ణన హృద్యంగా సాగింది. ఆయనను గౌరవిస్తూ కెనెడియన్, అమెరికన్ వైపులా స్మారక ఫలకాలను స్థాపించారు.
లలిత కళలు
[మార్చు]పర్యాటక రంగం
[మార్చు]వేసవి సమయంలో పర్యాటకుల సంఖ్య శిఖ్రాగ్రం చేరుకుంటుంది. అప్పుడు నయాగరా జలపాతం వద్ద పగటి వేళ అలాగే రాత్రివేళ కూడా ఆకర్షణలు ఉంటాయి. చీకటి పడిన తరువాత కెనడియన్ వైపు నుండి ఫ్లడ్ లైట్లను రెండు వైపులా జలపాతనికి ఫోకస్ చేసి కొన్ని గంటల సమయం ప్రసారం చేస్తారు. 2007 నాటికి 20 మిలియన్ల పర్యాటకులు విచ్చేస్తారని అప్పుడు అంచనా వేసారు. అలాగే 2009 నాటికి 28 మిలియన్ల పర్యాటకులు రాగలరని అంచనా వేసారు.
నయాగరా జలపాతం వద్ద చాలా కాలం నుండి ఉన్నది గుర్తించతగిన పర్యాటక ఆకర్షణ మైడ్ ఆఫ్ మిస్ట్ బోట్ క్రూసీ. ఒంజియారా ఇండియన్ల పౌరాణిక పాత్ర పేరును ఈ ఆక్ర్షణకు పెట్టారు. ఈ బోట్లు 1846 నుండి పర్యాటకులను దూసుకు పోతున్న జలపాతం కిందకు తీసుకు పోతున్నాయి. క్రూసీ బోట్లు రెండు వైపులా బోట్ రేవుల నుండి బయలుదేరుతుంటాయి.
అమెరుకా వైపు
[మార్చు]యు.ఎస్ వైపు అమెరికన్ జలపాతాలు ప్రాస్పెక్ట్ పాయింట్ పార్క్ కాలిబాట వెంట నడుస్తూ వీక్షించవచ్చు. ఈ పార్కులో ప్రాస్పెక్ట్ పాయింట్ పార్క్ అబ్జర్వేషన్ టవర్, మెయిడ్ ఆఫ్ ది మిస్ట్ కొరకు పడవ రేవు కూడా ఉంది. గోట్ ఐలాండ్ అధికమైన వీక్షణలను అందిస్తుంది. వీటిలో కాలిబాట వెంట నడుస్తూ వీక్షించడం, ఆటోమొబైల్ ద్వారా ప్రయాణం చేస్తూ అమెరికన్ వంతెన వరకు వెళ్ళి వీక్షించడం ఉన్నాయి. గోట్ ఐలాడ్ నుండి కేవ్ ఆఫ్ ది విండ్ ఏలివేటర్ ద్వారా బ్రిడల్ జలపాతానికి మెట్ల దారిలో వెళ్ళి వీక్షించ వచ్చు. గోట్ ఐలాండ్ లో త్రీసిస్టర్ ఐలాండ్, పవర్ పోర్టల్ నుండి వెళ్ళి పెద్ద నికోలస్ టెల్సా శిల్పం చూడ వచ్చు. అలాగే కాలిబాట వెంట నడుస్తూ దూసుకుంటూ ప్రవహిస్తున్న నయాగరా నది, హార్స్ షూ జలపాతం అలాగే మిగిలిన అన్ని జలపాతాలను దర్శించవచ్చు. ఈ ఆకర్షణలలో అధిక భాగం నయాగరా రాష్ట్రీయ ఉద్యానవనంలో (నయాగరా స్టేట్ పార్క్)ఉన్నాయి.
నయాగరా సైన్సు ట్రాలీ గోట్ ఐలాండ్, అమెరికన్ జలపాతం వెంట గైడు సహాయక పర్యటనలు అందిస్తుంది. ఫైట్ ఆఫ్ ఏంజిల్స్ హీలియం బెలూన్ లేక హెలికాఫ్టర్ఎక్కి జలపాతాల మనోహరమైన గగన వీక్షణం కూడా చేయవచ్చు. నయాగరా గోర్జ్ పరిశోధన కేంద్రం నయాగరా గోర్జ్, నయాగరా జలపాతా సంబంధిత ప్రకృతి సహజమైన, ప్రాంతీయమైన చరిత్రకు సంబంధించిన వివరాలను ప్రదర్శిస్తున్నది. సెనికా ఇండియన్ స్థానిక జాతులు ఒక కాసినో, విలాసవంతమైన హోట్ల్ నడుపుతున్నారు. ది సెనెకా నయాగరా కాసినో పాత నయాయరా సంప్రదాయ కేంద్రాన్ని స్వాధీన పరచుకుని నయాగరా కాసినో స్థాపించింది. 20వశతాబ్దంలో యునైటెడ్ ఆఫీస్ బిల్డింగ్ పూర్తి అయ్యే వరకు ఈ కొత్త హోటల్ ఏకైక ఆకాశసౌధంగా ఉంటూ వచ్చింది.
కెనడా వైపు
[మార్చు]కెనెడియన్ వైపు క్వీన్ విక్టోరియా పార్క్ కృత్రిమ ఉద్యానవనం ఉంది. అలాగే కమనీయమైన అమెరికన్, కెనిడియన్ జలపాతాలను, భూఅంర్గత మార్గాల ద్వారా ప్రయాణించి పరిశీలనా గదులను చేరుకుని జలపాతదృశ్యం చూడడానికి కావలసిన ఏర్పాట్లను చేసారు. ఈ దృశ్యాలను వీక్షించే సమయంలో జలపాతం మధ్యలో ఉన్న అనుభూతి కలుగుతుంది. స్కైలాన్ టవర్ వద్ద ఉన్న అబ్జర్వేషన్ టవర్ పైనుండి కింద ఉన్న జలపాత దృశ్యం వీక్షించే వీలు కలిగిస్తుంది. ఈ టవర్ ఎదురు దిశలో దూరంలో ఉన్న టొరంటో దృశ్యాలను చూడవచ్చు. కెనడ్ వైపు జలపాత దృశ్యాలను చూడడానికి ఉన్న మరొక టవర్ మినోల్టా. దీనిని ముందుగా సియాగ్రాంస్ టవర్, కోనికా మినోల్టా టవర్ అని పిలుస్తూవచ్చారు. ఇప్పుడు దీనిని టవర్ హోటెల్ అని కూడా పిలిస్తున్నారు.
నయాగరా నది పక్కన నయాగరా రిక్రియేషనల్ ట్రైల్ (వినోద యాత్ర) ఫోర్ట్ ఎర్రీ నుండి ఫోర్ట్ గోర్జ్ వరకు 35 కిలోమీటర్లు దూరం ఏర్పాటు చేయబడి ఉంది. ఈ దారిలో 1882 లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధ దృశ్యాలకు చెందిన చారిత్రాత్మక దృశ్యాలను చూడ వచ్చు.
1996లో స్పానిష్ ఇంజనీర్ లియోనార్డో టర్రెస్ వై క్యువిడో రూపకల్పనలో ది వైర్ల్ పూల్ ఎయిరో కార్ కేబుల్ కార్ నిర్మించబడింది. అది కెనడా వైపు పర్యాటకులను నయాగరా సుడిగుండం మీదుగా తీసుకు పోతుంది. ది జర్నీ బిహైండ్ ది ఫాల్స్ కెనెడియన్ వైపు నయాగరా హార్స్ షూ జలపాతం సమీపం వరకు వరుస సొరంగ మార్గాల ద్వారా జలపాతాన్ని వీక్షించే అవకాశం లభిస్తుంది. కెనెడియన్ వైపు రెండు రెండు కాసినోలు (జూదగృహాలు) ఉన్నాయి. ది ఫాల్స్ వ్యూ టూరిస్ట్ ఏరియాలో అనేక ప్రాంతీయ హోట్ళ్ళ మధ్య ఉన్న ది నయాగరా వ్యూ కాసినో రిసార్ట్, ఫాల్స్ హిల్ వద్ద ఉన్న కాసినో నయాగరా.
సమగ్ర దృశ్యము
[మార్చు]చిత్రమాలిక
[మార్చు]-
Louis Rémy Mignot, Niagara, Brooklyn Museum
-
Arthur Parton, Niagara Falls, Brooklyn Museum
-
Thomas Cole, Distant View of Niagara Falls 1830, Art Institute of Chicago
-
Alvan Fisher, A General View of the Falls of Niagara, 1820, The Smithsonian Institution
-
William Morris Hunt, Niagara Falls, 1878
బయటి లింకులు
[మార్చు]- Niagara Falls - History of Power Historical and engineering data on the U.S. and Canadian power stations
- Geology of Niagara Falls
- Panorama Niagara Falls Panorama found at Queen's Park, Toronto.
- Niagara Falls Guidebooks from the 19th Century Digitally-recreated 19th century guidebooks
- Historic Niagara Digital Collections
- US Army Corps of Engineers The US Army Corps of Engineers completely blocked the flow of water over the American Falls in 1969.