దక్షుడు
దక్షుడు బ్రహ్మ కుడి బొటనవేలు నుండి పుట్టాడు. దేవా దేవేంద్రుడు ఇంద్ర దేవుని భక్తుడు, పురాణాల ప్రకారం ఇంద్ర దేవునికి 101 అవతారలు!అశిక్ని/వీరణి/ధరణిని పెండ్లాడాడు.వీరికి కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ మొదలైన యాబైమంది కుమార్తెలు, ఐదుగురు కుమారులు జన్మించారు.వీరియందు ఎనిమిదిమంది ముఖ్యులు.వీరిలో సతియను ఆమె పెద్దది.ఆమెను శివుని కిచ్చి పెళ్ళి చేసెను.యజ్ఞం చేసి తన కూతురు సతీదేవిని, అల్లుడు శివుడినీ ఆహ్వానించడు. పిలువకుండానే యజ్ఞానికి వచ్చిన సతీదేవిని దక్షుడు అవమానించగా, ఆమె యోగాగ్నిలో దగ్ధమైపోతుంది. దానికి కోపించి, శివుడు వీరభద్రుని పంపి యజ్ఞాన్ని ధ్వంసం చేయిస్తాడు. దక్షుడు శివుడిచేత సంహరింపబడతాడు. తరువాత దేవతలు మేక తలకాయ తెచ్చి దక్షుణ్ణి బ్రతికిస్తారు. అందుకే ఇతన్ని 'అజముఖుడు' అనికూడా అంటారు.
దక్ష యజ్ఞం
[మార్చు]దక్షుడు ప్రజాపతుల్లో ఒకడు. దక్షుడి చిన్న కూతురు సతీదేవి/దాక్షాయణి. ఆమె వివాహం చేసుకుంటే శివుణ్ణే చేసుకుంటానని పట్టుబడుతుంది. దక్షుడు అందుకు అంగీకరించడు. కానీ ఆమె అందుకు తండ్రితో విభేదించి శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. కానీ దక్షుడు మాత్రం శివుణ్ణి ద్వేషించేవాడు. శరీరమంతా బూడిద పూసుకుని, శ్మశానాల వెంట తిరిగే వాడని దూషించేవాడు. అప్పటి నుంచే తన అల్లుడుకీ, కూతురుకి కూడా దూరమయ్యాడు. దక్షయజ్ఞంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇరవై ఏడుగురు నక్షత్రాలు కుమార్తెలు. వీరందరినీ చంద్రుడు పెండ్లాడాడు. బ్బృహస్పతీ
1. నవబ్రహ్మలలో (లేక ప్రజాపతులలో) ఒక్కఁడు. కొందఱు ఇతఁడు బ్రహ్మయొక్క అంగుష్ఠముననుండి పుట్టినవాఁడు అంటారు. కొందఱు బ్రహ్మమానసపుత్రుఁడు అంటారు. ఇతని భార్య ప్రసూతి. విష్ణుపురాణప్రకారము దక్షప్రజాపతికి కొమార్తెలు ఇరువదినలువురు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపువు, శాంతి, సిద్ధి, కీర్తి ఈపదిమువ్వురు ధర్ముని భార్యలు. (ధర్మద్వారములని ఎఱఁగవలయును.) ఈవీరియందు ధర్మునకు పుట్టిన పుత్రులు క్రమముగా కాముఁడు, దర్పుఁడు, నియముఁడు, సంతోషుఁడు, లోభుఁడు, శ్రుతుఁడు, దండుడు, బోధుఁడు, వినయుఁడు, వ్యవసాయుఁడు, క్షేముఁడు, సుఖుఁడు, యశుఁడు. 2. ఇతఁడు ప్రచేతస్సులకు చంద్రుని (సోముని) కూఁతురు అగు మారిషయందు పుట్టిన కొడుకు. ఈయన చక్షుర్మనువు కాలమున ఉండినట్లు కొందఱు చెప్పుదురు. ఇతఁడు బ్రహ్మయాజ్ఞపడసి మైథునక్రియవలన సృష్టిచేయ ఆరంభించెను. తత్పూర్వము సంతానము దృష్టిసర్శేచ్ఛాదులవలన కలుగుచు ఉండినట్టు తెలియవచ్చుచున్నది. ఈతఁడు వీరణప్రజాపతి కూఁతురు అగు అసిక్నిని భార్యగా గ్రహించి ఆమె యందు తొలుత హర్యశ్వులు అను ననేక పుత్రులను పడసెను. వారు అందఱును నారదుని ఉపదేశమున ప్రజాసృష్టియందు ఇచ్ఛ ఉడిగిరి. మరల శబలాశ్వులు అను ననేక పుత్రులను పుట్టించెను. వారలును అట్ల అయిరి. అంత దక్షుఁడు నారదుని మీద కోపించి అతనికి అనపత్యతయును నిరంతర సంచారమును కలుగునట్లు శపించి అఱువండ్రు కొమార్తలను అసిక్నియందు పుట్టించెను. అందు ధర్మునికి పదుగురను, కశ్యపునికి పదుమువ్వురను, చంద్రునకు ఇరువదియేడుగురను, అరిష్టనేమికి నలుగురను, అంగిరసునకు ఇరువురను, కృశాశ్వునకు ఇరువురను, బహుపుత్రునకు ఇరువురను ఇచ్చి వివాహములు చేయించెను. శ్రీమద్భాగవతమున తార్క్ష్యుఁడు అను నామాంతరము తాల్చిన కశ్యపునకు మరల నలుగురు కొమార్తెలను ఇచ్చినట్లు చెప్పి ఉంది. (ధర్ముని భార్యలు 10మందా 13గురా???)
ధర్ముని భార్యలు వారిసంతతి అరుంధతి పృథివితో చేరిన సమస్తము వసువు అష్ట వసువులు యామి (లేక) జామి దుర్గ భూములకు అధిష్ఠానదేవత లంఘ (లేక) లంబ ఘోషుఁడు లేక విద్యోతుఁడు భానువు భానువులు మరుద్వతి మరుత్వంతుఁడు, జయంతుఁడు సంకల్ప సంకల్పుఁడు ముహూర్త మౌహీర్తికులు సాధ్య సాధ్యులు విశ్వ ఐదుగురు విశ్వేదేవతలు
చంద్రుని భార్యలు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషక్కు, పూర్వాబాధ్ర, ఉత్తరాబాధ్ర, రేవతి అనువారు. (ఈయిరువదియేడుగురును నక్షత్రములు అనఁబడుదురు)
కశ్యపుని పదుమువ్వురు భార్యల నామములను గూర్చి. చూ|| కశ్యపుఁడు.
తొల్లి దక్షుఁడు యాగము చేసినపుడు రుద్రునికి హవిర్భాగము ఇయ్యనందున అతినికి మరల జన్మము కలిగెను అని అంటారు.
శ్రీమద్భాగవతమున అరుంధతిని దక్షపుత్రిగా చెప్పి ఉండలేదు. ఆమెకు మారు కకుబ్దేవిని చెప్పి ఉంది. కకుబ్దేవికి సంకటుఁడును, సంకటునకు కీకటుఁడును, కీకటునకు దుర్గాభిమానులైన దేవతులును పుట్టినట్లు చెప్పి ఉంది. మఱియు యామి సంతతికి స్వర్గుఁడు, నది అను నిరువురు పుట్టినట్లును సంకల్పకు కాముఁడు పుట్టినట్లును శ్రీమద్భాగవతమువలన తెలియఁబడుచు ఉంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- డా.బూదరాజు రాధాకృష్ణ సంకలనంచేసిన పురాతన నామకోశం. (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి ప్రచురణ).