iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: https://te.wikipedia.org/wiki/కాస్పియన్_సముద్రం
కాస్పియన్ సముద్రం - వికీపీడియా Jump to content

కాస్పియన్ సముద్రం

అక్షాంశ రేఖాంశాలు: 41°40′N 50°40′E / 41.667°N 50.667°E / 41.667; 50.667
వికీపీడియా నుండి
కాస్పియన్ సముద్రం
టెర్రా ఉపోగ్రహం నుండి తీసిన కాస్పియన్ సముద్ర చిత్రం. 2003 జూన్
ప్రపంచ పటంపై కాస్పియన్ సముద్ర స్థానం
ప్రపంచ పటంపై కాస్పియన్ సముద్ర స్థానం
కాస్పియన్ సముద్రం
ప్రదేశంతూర్పు ఐరోపా, మధ్య ఆసియా, పశ్చిమాసియా
అక్షాంశ,రేఖాంశాలు41°40′N 50°40′E / 41.667°N 50.667°E / 41.667; 50.667
రకంపురాతన సరస్సు, ఎండోరిక్, ఉప్పునీటి, శాశ్వత, సహజ
సరస్సులోకి ప్రవాహంవోల్గా నది, ఉరల్ నది, కురా నది, టెరెక్ నది
వెలుపలికి ప్రవాహంఆవిరి
పరీవాహక విస్తీర్ణం3,626,000 కి.మీ2 (1,400,000 చ. మై.)[1]
ప్రవహించే దేశాలుఅజర్‌బైజాన్
ఇరాన్
కజఖ్‌స్తాన్
రష్యా
తుర్క్జ్‌మేనిస్తాన్
గరిష్ట పొడవు1,030 కి.మీ. (640 మై.)
గరిష్ట వెడల్పు435 కి.మీ. (270 మై.)
ఉపరితల వైశాల్యం371,000 కి.మీ2 (143,200 చ. మై.)
సరాసరి లోతు211 మీ. (690 అ.)
గరిష్ట లోతు1,025 మీ. (3,360 అ.)
78,200 కి.మీ3 (18,800 cu mi)
నిల్వ సమయం250 ఏళ్ళు
తీరంపొడవు17,000 కి.మీ. (4,300 మై.)
ఉపరితల ఎత్తు−28 మీ. (−92 అ.)
ద్వీపములు26
ప్రాంతాలుబాకు, నౌషహర్,రష్త్, అక్టౌ, మఖచ్‌కలా, తుర్క్‌మెన్‌బేసి
మూలాలు[1]
1 Shore length is not a well-defined measure.

కాస్పియన్ సముద్రం ప్రపంచoలోనే అతిపెద్ద భూపరివేష్ఠిత జలాశయం. ప్రపంచంలోని అతిపెద్ద సరస్సుగాను, పూర్తి స్థాయి సముద్రం గానూ దీన్ని వర్గీకరించారు. ఇది యూరప్, ఆసియా ల మధ్య ఉన్న ఎండోరిక్ బేసిన్ (నీరు రావడమే గానీ, నీరు బయటికి పోయే మార్గం లేని బేసిన్). కాకసస్‌కు తూర్పున, మధ్య ఆసియా లోని విశాలమైన గడ్డిమైదానాలకు పశ్చిమాన, తూర్పు ఐరోపాలోని రష్యా దక్షిణ ప్రాంతపు సారవంతమైన మైదానాలకు దక్షిణాన, పశ్చిమ ఆసియాలోని పర్వతీయ ఇరానియన్ పీఠభూమికి ఉత్తరాన కాస్పియన్ సముద్రం ఉంది. ఇది 3,71,000 చ.కి.మీ. విస్తీర్ణంతో (అత్యంత ఉప్పటి నీటితో ఉండే గరబోగాజ్కోల్ మడుగును కలపకుండా), 78,000 కి.మీ.3 ఘనపరిమాణంతో ఉంది. కాస్పియన్ సముద్రపు లవణీయత 1.2% (12 గ్రా / లీటరు). ఇదిసముద్రపు నీటి సగటు లవణీయతలో మూడవ వంతు. దీనికి మధ్య-ఉత్తరం నుండి మధ్య-తూర్పు వరకు కజకిస్తాన్, మధ్య-ఉత్తరం నుండి మధ్య-పడమర వరకు రష్యా, నైరుతిలో అజర్‌బైజాన్, దక్షిణాన, ఆ ప్రక్కనే ఉన్న మూలల్లో ఇరాన్, తూర్పు తీరపు దక్షిణ భాగంలో తుర్కమేనిస్తాన్ లు సరిహద్దులుగా ఉన్నాయి.

కాస్పియన్ సముద్రం దాదాపు 1,200 చ.కి.మీ. లలో విస్తరించి ఉంది. ఉత్తర దక్షిణాల్లో సగటున 320 కి.మీ. వెడల్పు ఉంటుంది. దీని స్థూల ఉపరితల వైశాల్యం 3,86,400 చ.కి.మీ. దీని ఉపరితలం సముద్ర మట్టానికి సుమారు 27 మీటర్ల దిగువన ఉంటుంది. ఐరోపాలోకెల్లా పొడవైన నది, వోల్గా, ఈ సముద్రపు ఉత్తరపు కొనన దానిలో సంగమిస్తుంది. ఇది కాస్పియన్ సముద్రం లోకి వచ్చే ప్రధానమైన మంచినీటి ప్రవాహం. దీనికి ఉన్న రెండు లోతైన బేసిన్లు మధ్య, దక్షిణ మండలాలను ఏర్పరుస్తున్నాయి. వీటివలన కాస్పియన్ సముద్రపు ఉష్ణోగ్రత, లవణీయత, జీవావరణాల్లో క్షితిజ సమాంతరంగా తేడాలు ఏర్పడుతున్నాయి. సముద్రపు దక్షిణ భాగంలో సముద్రగర్భం సముద్రమట్టానికి దిగువన 1,023 మీటర్లు ఉంటుంది. ఇది బైకాల్ సరస్సు (1,180 మీటర్లు) తరువాత భూమిపై రెండవ అత్యంత లోతైన గొయ్యి. దాని తీరంలోని నివసించిన ప్రాచీనులు వ్రాసిన వృత్తాంతాలను బట్టి వారు కాస్పియన్ సముద్రాన్ని ఒక మహాసముద్రంగా భావించారు. బహుశా దాని లవణీయత, పెద్ద పరిమాణాల కారణంగా అలా భావించి ఉండవచ్చు.

కాస్పియన్ సముద్రం విస్తృతమైన జీవ జాతులకు నిలయం. కేవియర్, చమురు పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. చమురు పరిశ్రమ నుండి వెలువడే కాలుష్యం ప్రధానం గాను, నదులపై నిర్మించిన ఆనకట్టలు కొంతమేరకూ దాని పర్యావరణానికి హాని కలిగించాయి.

పేరు వ్యుత్పత్తి

[మార్చు]

కాస్పి కాగ్నేట్ పర్యాయపదాలు

[మార్చు]

కాస్పియన్ అనే పదం ట్రాన్స్‌ కకేసియాలో సముద్రానికి నైరుతి దిశలో నివసించిన పురాతన ప్రజలు కాస్పికి పేరుగా ఉండవచ్చు. [2] స్ట్రాబో సుమారు సా.శ. 24లో మరణించాడు "అల్బేనియన్ల దేశానికి కాస్పియన్ అనే భూభాగానికి చెందినది అని వ్రాశాడు, దీనికి కాస్పియన్ తెగ పేరు పెట్టారు. కానీ తెగ ఇప్పుడు అదృశ్యమైంది.[3]"  అంతేకాకుండా, ఇరాన్ టెహ్రాన్ ప్రావిన్స్‌లో భాగమైన కాస్పియన్ గేట్స్ , అటువంటి ప్రజలు దక్షిణం వైపుకు వలస వచ్చినట్లు రుజువు చేయవచ్చు. ఇరాన్ నగరం ఖజ్విన్ సముద్రం కోసం ఈ సాధారణ పేరుతో దాని పేరు మూలాన్ని పంచుకుంటుంది. సముద్ర సంప్రదాయ , మధ్యయుగ అరబిక్ పేరు బహర్ (సముద్ర) అని ఉంది కానీ కహజర్ ఇటీవలి శతాబ్దాల్లో అరబీ భాషలో సాధారణమైన ప్రామాణిక పేరు బహ్ర్ ఉంది క్వజ్విన్ కాస్పియన్ నుండి అజర్బైజాద్[4] ను తీసుకున్నారు.  

హిర్కానియా పదం

[మార్చు]

ప్రాచీన కాలంలో గ్రీకులు ,పర్షియన్లలో ఇది ఒక హిర్కానియన్ మహాసముద్రం[5] గా ఉండేది.

ఖాజర్ కాగ్నేట్ పర్యాయపదాలు

[మార్చు]

అజర్బైజాన్లు , తుర్క్మెన్లు ,టర్కిష్ ప్రజలు వంటి టర్కిక్ జాతి సమూహాలు దాని ఖాజర్ /హజార్ పేరును ఉపయోగించడానికి దీనిని ఉదాహరణ గా ఈ క్రింది వాటిని సూచిస్తారు

  • లో తుర్కమెన్: హజార్ డెనిజి
  • లో అజర్బైజాన్: జజార్ డానిజి
  • లో ఆధునిక టర్కిష్: హజార్ డెనిజి .

వీటన్నింటిలో, రెండవ పదం "సముద్రం" అని అర్ధం, మొదటి పదం 7వ 10వ శతాబ్దాల మధ్య కాస్పియన్ సముద్రానికి ఉత్తరాన పెద్ద సామ్రాజ్యాన్ని కలిగి ఉన్న చారిత్రక ఖాజర్‌లను సూచిస్తుంది.

పరీవాహక దేశాలు

[మార్చు]

సముద్రానికి సరిహద్దుగా ఉన్న పరీవాహక దేశాలు

[మార్చు]

సరిహద్దు కాని పరీవాహక దేశాలు

[మార్చు]
  •  Armenia (పూర్తిగా)
  •  Georgia (తూర్పు ప్రాంతం)
  •  Turkey (బాగా ఈశాన్యాన ఉన్న ప్రాంతాలు)
  •  Uzbekistan (బాగా పశ్చిమాన ఉన్న ప్రాంతాలు)

భౌతిక లక్షణాలు

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

నల్ల సముద్రం లాగానే కాస్పియన్ సముద్రం కూడా పురాతన పారాటెథిస్ సముద్రం యొక్క అవశేషమే. అందుచేతనే ఈ సముద్రపు అడుగుభాగం ఖండాంతర గ్రానైట్ శిలలతో కాక, ప్రామాణిక సముద్రపు బసాల్ట్‌తో కూడుకుని ఉంటుంది. 55 లక్షల సంవత్సరాల క్రితం టెక్టోనిక్ పలకలు పైకి లేచినపుడు, సముద్ర మట్టం పతనం కారణంగా ఇది భూపరివేష్ఠితమై పోయింది. వెచ్చని, పొడి వాతావరణ కాలాల్లో, ఈ భూపరివేష్ఠిత సముద్రం దాదాపు ఎండిపోయింది. ప్రస్తుతం ఉత్తరం నుంచి వచ్చే మంచినీటి ప్రవాహం కారణంగా, కాస్పియన్ సముద్రపు నీరు దాని ఉత్తర భాగంలో దాదాపుగా తాజాగా ఉంటుంది. దక్షిణం వైపున మరింత ఉప్పునీరు ఉంటోంది. పరీవాహక ప్రాతం నుండి అత్యంత తక్కువ నీరు వచ్చి చేరే ఇరానియన్ తీరాన లవణీయత అత్యంత అధికంగా ఉంటుంది. [6] ప్రస్తుతం, కాస్పియన్ సముద్రపు సగటు లవణీయత భూమిపై నున్న మహాసముద్రాల మొత్తం లవణీయతలో మూడింట ఒక వంతు. 1980 లో కాస్పియన్ ప్రధానభాగం నుండి తెగిపోయినపుడు గరబోగాజ్కోల్ ఎంబేమెంటు ఎండిపోయింది. ఆ తరువాత దాఅన్ని తిరిగి కలిపారు. ఇక్కడి లవణీయత మహాసముద్ర లవణీయతకు 10 రెట్లు ఉంటూంటుంది. [7]

భౌగోళికం

[మార్చు]
కాస్పియన్ సముద్రం చుట్టూ ఉన్న ప్రాంతం. పసుపు రంగులో నున్నది దీని డ్రైనేజీ ప్రాంతాన్ని సూచిస్తుంది.

కాస్పియన్ సముద్రం ప్రపంచంలోనే అతి పెద్ద లోతట్టు నీటి వనరు. ప్రపంచంలోని మొత్తం లోతట్టు జలాలలో 40 నుండి 44% వరకు ఇక్కడే ఉంది. [8] కాస్పియన్ తీరప్రాంతాల్లో అజర్‌బైజాన్, ఇరాన్, కజాఖ్స్తాన్, రష్యా, తుర్క్‌మెనిస్తాన్‌లు దేశాలున్నాయి. కాస్పియన్‌ను మూడు విభిన్న భౌతిక ప్రాంతాలుగా విభజించవచ్చు: ఉత్తర, మధ్య, దక్షిణ కాస్పియన్. [9] ఉత్తర-మధ్య సరిహద్దు మాంగిష్లాక్ థ్రెషోల్డ్, ఇది చెచెన్ ద్వీపం, కేప్ టియుబ్-కరగన్ గుండా వెళుతుంది. మధ్య-దక్షిణ సరిహద్దు అయిన అప్షేరోన్ త్రెషోల్డ్ [10] ఇది ఝిలోయి ద్వీపం, కేప్ కువులి గుండా పోతుంది. [11] గారాబోగాజ్‌కోల్ బే అనేది కాస్పియన్‌కు తూర్పు ప్రవేశద్వారం. ఇది తుర్క్‌మెనిస్తాన్‌లో భాగం. కాస్పియన్ నుండి తెగిపోయే ఇస్త్మస్ కారణంగా కొన్నిసార్లు దీనికిదే స్వంతంత్ర సరస్సుగా ఉంటూ ఉంటుంది.

మూడు ప్రాంతాల మధ్య విభేదాలు చాలా విస్పష్టంగా ఉంటాయి. ఉత్తర కాస్పియన్ కాస్పియన్ షెల్ఫ్‌ను మాత్రమే కలిగి ఉంటుంది, [12] చాలా లోతుగా ఉంటుంది; ఇక్కడి నీరు మొత్తం నీటి పరిమాణంలో 1% కంటే తక్కువ. సగటు లోతు కేవలం 5–6 మీటర్లు (16–20 అ.) ఉంటుంది. ఇక్కడి నుండి మధ్య కాస్పియన్ వైపు వేళ్తూంటే లోతు పెరుగుతూ పోతుంది. మధ్య కాస్పియన్‌లో సగటు లోతు 190 మీటర్లు (620 అ.) ఉంటుంది. [11] దక్షిణ కాస్పియన్ అత్యంత లోతైన ప్రాంతం. ఇక్కడి లోతు 1,000 మీటర్లు (3,300 అ.) ఉంటుంది. పర్షియన్ గల్ఫ్ వంటి ఇతర ప్రాంతీయ సముద్రాల లోతు కంటే ఇది ఎక్కువ. మధ్య దక్షిణ కాస్పియన్‌ల నీటి పరిమాణం, మొత్తం నీటి పరిమాణంలో 33%, 66% ఉంటుంది. [9] కాస్పియన్ సముద్రపు ఉత్తర భాగం సాధారణంగా చలికాలంలో గడ్డకడుతుంది. అత్యంత శీతలంగా ఉన్న చలికాలంలోనైతే దక్షిణాన కూడా మంచు ఏర్పడుతుంది. [13]

130 కంటే ఎక్కువ నదులు కాస్పియన్‌ సముద్రం లోకి ప్రవాహిస్తాయి. వీటిలో వోల్గా నది అతిపెద్దది. రెండవదైన ఉరల్ నది ఉత్తరం నుండి ప్రవహిస్తుంది. కురా నది పశ్చిమం నుండి సముద్రంలోకి ప్రవహిస్తుంది. గతంలో, తూర్పున ఉన్న అము దర్యా (ఆక్సస్) నది ఉత్తరాన ఉన్న సిర్ దర్యా లాగానే ప్రవాహ మార్గాన్ని మార్చుకునేది. ఉజ్బోయ్ నది అని పిలువబడే ప్రస్తుతం ఎండిపోయిన నదీగర్భం గుండా కాస్పియన్‌ లోకి ప్రవహించేది. కాస్పియన్‌లో అనేక చిన్న ద్వీపాలున్నాయి; అవి ప్రధానంగా ఉత్తరాన దాదాపు 2,000 కి.మీ2 (770 చ. మై.) విస్తీర్ణంలో ఉన్నాయి. ఉత్తర కాస్పియన్‌కు ఆనుకొని ఉన్న కాస్పియన్ డిప్రెషన్, సముద్ర మట్టానికి 27 మీ. దిగువన ఉండే పల్లపు ప్రాంతం. మధ్య ఆసియా స్టెప్పీలు ఈశాన్య తీరంలో విస్తరించి ఉండగా, కాకసస్ పర్వతాలు పశ్చిమ తీరాన్ని ఆవరించి ఉంటాయి. ఉత్తరం, తూర్పులలో చల్లని, ఖండాంతర ఎడారులుంటాయి. దీనికి విరుద్ధంగా, నైరుతి, దక్షిణాల్లో ఎత్తైన ప్రాంతాలు, పర్వత శ్రేణులు ఉండడం వలన, వాతావరణం సాధారణంగా వెచ్చగా ఉంటుంది. కాస్పియన్‌తో పాటు వాతావరణంలో సంభవించిన విపరీతమైన మార్పుల వలన ఈ ప్రాంతంలో గొప్ప జీవవైవిధ్యం ఏర్పడింది. [7]

కాస్పియన్ సముద్రం అంతటా అనేక ద్వీపాలున్నాయి. అవన్నీ తీరాలకు సమీపంలోనే ఉన్నాయి; సముద్రపు లోపలి ప్రాంతాలలో ద్వీపాల్లేవు. ఒగుర్జా అడా అతిపెద్ద ద్వీపం. ఇది 37 కి.మీ. పొడవున ఉంటుంది. జింకలు అక్కడ స్వేచ్ఛగా తిరుగుతూంటాయి. ఉత్తర కాస్పియన్‌లో ఉండే చాలా ద్వీపాలు చిన్నవి, జనావాసాలు లేనివి. త్యులేని ద్వీపసమూహం అలాంటిదే. అక్కడి దీవుల్లో కొన్నిటిలో మానవ నివాసాలు ఉన్నాయి.

ప్రకృతి

[మార్చు]

జలచరాలు

[మార్చు]

వృక్షజాలం

[మార్చు]

1994 - 1996 మధ్య కాస్పియన్ సముద్ర మట్టం పెరగడంతో అరుదైన జాతుల జల వృక్షాల సంఖ్య తగ్గింది. కొత్తగా ఏర్పడిన తీర సరస్సులు తదుతర నీటి వనరులలో సాధారణంగా విత్తన పదార్థం లేకపోవడం దీనికి కారణమని చెప్పబడింది. 

జంతుజాలం

[మార్చు]
చాలా టాడ్‌పోల్ గోబీలు ( బెంథోఫిలస్ ) కాస్పియన్ సముద్రపు బేసిన్‌లో మాత్రమే కనిపిస్తాయి. [14]

నగరాలు

[మార్చు]
అజర్‌బైజాన్ రాజధాని బాకు, కాస్పియన్ సముద్రం వద్ద అతిపెద్ద నగరం.

ప్రాచీన

[మార్చు]
  • హిర్కానియా, ఇరాన్‌కు ఉత్తరాన ఉన్న పురాతన రాష్ట్రం
  • సారీ, ఇరాన్‌లోని మజాందరన్ ప్రావిన్స్
  • అంజలి, ఇరాన్‌లోని గిలాన్ ప్రావిన్స్
  • అస్టారా, ఇరాన్‌లోని గిలాన్ ప్రావిన్స్
  • అస్తరాబాద్, ఇరాన్‌లోని గోలెస్తాన్ ప్రావిన్స్
  • తమిషే, ఇరాన్‌లోని గోలెస్తాన్ ప్రావిన్స్
  • అటిల్, ఖజారియా
  • ఖజారన్
  • బాకు, అజర్‌బైజాన్
  • డెర్బెంట్, డాగేస్తాన్, రష్యా
  • Xacitarxan, ఆధునిక ఆస్ట్రాఖాన్దానిపై దానిపై

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

చమురు, సహజ వాయువు

[మార్చు]
Oil production using drilling platform, on the offshore of Turkmenistan
చెల్కెన్ ఫీల్డ్ ( తుర్క్మెనిస్తాన్ ) లోని డ్రాగన్ ఆయిల్ ఉత్పత్తి వేదిక వద్ద డ్రిల్లింగ్ ప్లాట్‌ఫాం "ఇరాన్ ఖాజర్".

బిపి అమోకో, యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్, యుఎస్ ఇంధన శాఖ అంచనాల ఆధారంగా.కాస్పియన్ సముద్ర ప్రాంతం ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లకు ముడి చమురు సరఫరా చేసే గుర్తింపు పొందిన దేశాలలో ఒకటే గానీ, అంత పెద్ద సరఫరాదారేమీ కాదు. 2001 లో ఈ ప్రాంతం నుండి రోజుకు 1.4–1.5 మిలియన్ బారెళ్ళ ముడిచమురు, సహజ వాయువు ద్రవాలు ఉత్పత్తి అయింది. ఇది మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 1.9%. డజనుకు పైగా దేశాలు ఈ సంఖ్య కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. కాస్పియన్ ప్రాంత ఉత్పత్తి ఇంతకంటే ఎక్కువగా ఉండేది. కానీ సోవియట్ యూనియన్ పతనం సమయంలోను, ఆ తరువాతా ఇది క్షీణించింది. ఈ ప్రాంత చమురు ఉత్పత్తిలో కజకస్తాన్‌కు 55%, అజర్‌బైజాన్‌కు 20% వాటా ఉంది . [15]

కాస్పియన్ ప్రాంతంలో చమురు, సహజ వాయువుల మౌలిక సదుపాయాలు. ఆగస్టు 2013.

అజర్‌బైజాన్‌లోని బాకు సమీపంలో ఉన్న బీబీ-హేబాట్ బేలో ప్రపంచంలో మొట్టమొదటి ఆఫ్‌షోర్ బావులు, మెషిన్ డ్రిల్లింగ్ బావులు తవ్వారు 1873 లో అబ్షెరాన్ ద్వీపకల్పం లోని బాలాఖాన్లీ, సబుంచి, రమానా, బీబీ హేబాట్ గ్రామాలకు సమీపంలో చమురు అన్వేషణ, అభివృద్ధి ప్రారంభమైంది. ఆ సమయంలో ప్రపంచంలో ఉనికిలో ఉన్న అతిపెద్ద క్షేత్రాలివి. మొత్తం వెలికి తీయగల నిల్వలు 50 కోట్ల టన్నుల కంటే ఎక్కువ. 1900 నాటికి, బాకులో 3,000 కుపైగా చమురు బావులు ఉన్నాయి. వాటిలో 2,000 బావుల్లో పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి జరుగేది. 19 వ శతాబ్దం చివరి నాటికి, బాకు "నల్ల బంగారు రాజధాని" గా ప్రసిద్ది చెందింది. చాలామంది నైపుణ్యం కలిగిన కార్మికులు, నిపుణులు నగరానికి వలస వచ్చారు.

20 వ శతాబ్దం ప్రారంభంలో, బాకు అంతర్జాతీయ చమురు పరిశ్రమకు కేంద్రంగా ఉంది. 1920 లో, బోల్షెవిక్‌లు అజర్‌బైజాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు, చమురు బావులు, కర్మాగారాలతో సహా అన్ని ప్రైవేట్ ఆస్తులను జాతీయం చేసారు. రిపబ్లిక్ లోని చమురు పరిశ్రమ వేగంగా సోవియట్ యూనియన్ నియంత్రణలోకి వచ్చింది. 1941 నాటికి, అజర్‌బైజాన్ రికార్డు స్థాయిలో సంవత్సరానికి 2.35 కోట్ల టన్నుల చమురును ఉత్పత్తి చేస్తోంది. బాకు ప్రాంతంలో జరిగిన ఉత్పత్తి మొత్తం సోవియట్ యూనియన్ చమురు ఉత్పత్తిలో దాదాపు 72 శాతం.

బాకు చమురు క్షేత్రాల ప్రాంతీయాంతర అభివృద్ధికి తెరదీస్తూ, 1994 లో, "శతాబ్దపు కాంట్రాక్టు" పై సంతకాలు జరిగాయి. పెద్ద బాకు-టిబిలిసి-సెహాన్ పైప్‌లైన్ అజేరి చమురును టర్కిష్ మధ్యధరా ఓడరేవు అయిన సెహన్‌కు తీసుకువెళ్తుంది. ఈ పైపులైన్ను 2006 లో ప్రారంభించారు.

సరస్సు రష్యను భాగంలో వ్లాదిమిర్ ఫిలనోవ్స్కీ చమురు క్షేత్రాన్ని 2005 లో కనుగొన్నారు. ఇది 25 సంవత్సరాలలో కనుగొనబడిన అతిపెద్ద నిక్షేపమని వార్తలు వచ్చాయి. దాని నుండి లుకోయిల్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని 2016 అక్టోబరులో ప్రకటించారు. [16]

రవాణా

[మార్చు]

అజర్‌బైజాన్‌లో చమురు ట్యాంకర్‌ల వంటి అన్ని పెద్ద ఓడల ప్రధాన మూరింగ్‌లు బాకులో ఉన్నాయి. ఇది కాస్పియన్ సముద్రం లోని అతిపెద్ద నౌకాశ్రయం. ఈ ఓడరేవు నుండి కాస్పియన్ సముద్రం-వోల్గా - వోల్గా-డాన్ కెనాల్, డాన్-సీ ఆఫ్ అజోవ్ గుండా మహాసముద్రాల్లోకి అనుసంధానం ఉంది. బాకు సీ ట్రేడ్ పోర్ట్, కాస్పియన్ షిప్పింగ్ కంపెనీలు అజర్‌బైజాన్ సముద్ర రవాణాలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. కాస్పియన్ సీ షిప్పింగ్ కంపెనీకి రెండు నౌకాదళాలు, షిప్‌యార్డ్‌లూ ఉన్నాయి. దీని రవాణా సముదాయంలో 51 నౌకలు ఉన్నాయి: 20 ట్యాంకర్లు, 13 ఫెర్రీలు, 15 సార్వత్రిక డ్రై కార్గో నాళాలు, 2 రో-రో నౌకలు, అలాగే 1 సాంకేతిక నౌక, 1 ఫ్లోటింగ్ వర్క్‌షాప్ వీటిలో ఉన్నాయి. దీని ప్రత్యేక నౌకాదళంలో 210 నౌకలు ఉన్నాయి: 20 క్రేన్లు, 25 టోయింగ్, సరఫరాలు చేసే నౌకలు, 26 ప్యాసింజర్, రెండు పైప్-లేయింగ్, ఆరు అగ్నిమాపక, ఏడు ఇంజనీరింగ్-జియోలాజికల్, రెండు డైవింగ్, 88 సహాయక నౌకలు ఉందులో భాగం. [17]

రాజకీయ అంశాలు

[మార్చు]

అజర్బైజాన్ తీరం వెంబడి ఉన్న అనేక ద్వీపాల్లో ఉన్న చమురు క్షేత్రాల కారణంగా వాటికి గొప్ప భౌగోళిక రాజకీయ, ఆర్థిక ప్రాముఖ్యత ఏర్పడింది. బుల్లా ద్వీపం, పిరల్లాహి ద్వీపం, నర్గిన్ లలో చమురు నిల్వలున్నాయి. నర్గున్ ఇప్పటికీ మాజీ సోవియట్ స్థావరం లాగానే ఉపయోగించబడుతోంది. ఇది బాకు బేలో అతిపెద్ద ద్వీపం.

సోవియట్ యూనియన్ పతనంతో ఈ ప్రాంతంలో మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను మొదలైంది. దీంతో అంతర్జాతీయ చమురు కంపెనీలు పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టడానికి దారితీసింది. 1998లో, డిక్ చెనీ ఇలా వ్యాఖ్యానించాడు, "కాస్పియన్ లాగా అకస్మాత్తుగా వ్యూహాత్మకంగా ముఖ్యంగా మారిన ప్రాంతం మరొకటి నాకు తోచడం లేదు." [18]

స్థానికంగా అభివృద్ధి జరగడానికి కీలకమైన సమస్య ఐదు సముద్రతీర దేశాల మధ్య ఖచ్చితమైన, అంగీకరించబడిన సరిహద్దులను గుర్తించవడం. తుర్క్‌మెనిస్తాన్, ఇరాన్‌లతో అజర్‌బైజాన్‌కు సరిహద్దుల వెంబడి ప్రస్తుతమున్న వివాదాలు భవిష్యత్తులో అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి.

ప్రతిపాదిత ట్రాన్స్-కాస్పియన్ చమురు, గ్యాస్ పైప్‌లైన్‌లపై ప్రస్తుతం చాలా వివాదం ఉంది. ఈ ప్రాజెక్టుల వలన పాశ్చాత్య మార్కెట్‌లకు కజఖ్ చమురును, ఉజ్బెక్, తుర్క్‌మెన్ దేశాల గ్యాస్‌ను సులభంగా రవాణా చేయడానికి వీలుకలుగుతుంది. పర్యావరణ ప్రాతిపదికన రష్యా అధికారికంగా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది. [19] అయితే, పైప్‌లైన్‌లు రష్యాను పూర్తిగా తప్పించి సాగుతాస్తాయని, తద్వారా ఆ దేశాఅనికి వచ్చే విలువైన రవాణా రుసుములు రావనీ విశ్లేషకులు అంటారు. అలాగే ఈ ప్రాంతం నుండి పశ్చిమ దిశగా జరిగే హైడ్రోకార్బన్ ఎగుమతులపై ఆ దేశపు ప్రస్తుత గుత్తాధిపత్యాన్ని నాశనం చేస్తుందని కూడా విశ్లేషకులు గమనించారు. [19] ఇటీవల, కజాఖ్స్తాన్, తుర్క్మెనిస్తాన్ రెండూ ట్రాన్స్-కాస్పియన్ పైప్‌లైన్‌కు తమ మద్దతును తెలిపాయి. [20]

అజర్‌బైజాన్ కాస్పియన్ సముద్రంలోని అజెరి-చిరాగ్-గుణేషి ప్రాంతంలోని ఒక ఆపరేటింగ్ గ్యాస్ ఫీల్డ్‌లో 2008 సెప్టెంబరులో గ్యాస్ లీక్, బ్లోఅవుట్ సంఘటనను BP దాచిపెట్టిందని వికీలీక్స్ వెల్లడించిన అమెరికా దౌత్య కేబుల్స్ వెల్లడించాయి. [21] [22]

ప్రాదేశిక స్థితి

[మార్చు]
సదరన్ కాస్పియన్ ఎనర్జీ ప్రాస్పెక్ట్స్ (ఇరాన్ యొక్క భాగం). దేశం ప్రొఫైల్ 2004.
కాస్పియన్ సముద్రం, అజర్‌బైజాన్

తీరరేఖ

[మార్చు]

కాస్పియన్ తీరరేఖను వివిధ దేశాలు ఎలా పంచుకుంటాయనేది వివిధ వనరులు వివిధ రకాలుగా నిర్వచించాయి. అంతే కాకుండా వివిధ సమయాల్లో సముద్ర మట్టంలో వచ్చే మాపుల పెరుగుదల/తరుగుదల కారణంగా తీరరేఖ పొడవు మారడం వలన కూడా ఈ అంతరాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా 3 వనరులు వెల్లడించిన తీరరేఖ విభజన కింది విధంగా ఉంది.

దాదాపు 4800 కి.మీ.ల కాస్పియన్ తీరరేఖపై ఐదు దేశాలు ఉన్నాయి. ఈ దేశాల తీర రేఖ పొడవు: [23]

  1.  Kazakhstan - 1422 km
  2.  Turkmenistan - 1035 km
  3.  Azerbaijan - 813 km
  4.  Russia - 747 km
  5.  ఇరాన్ - 728 km

ఐదు రాష్ట్రాలు దాదాపు 6380 కి.మీ కాస్పియన్ తీరప్రాంతంలో ఉన్నాయి. ఈ దేశాల తీర రేఖ పొడవు: [24]

  1.  Kazakhstan - 2320 km
  2.  Turkmenistan - 1200 km
  3.  Azerbaijan - 955 km
  4.  ఇరాన్ - 900 km
  5.  Russia - 695 km

ఐదు రాష్ట్రాలు దాదాపు 6500 కి.మీ కాస్పియన్ తీరప్రాంతంలో ఉన్నాయి. ఈ దేశాల తీర రేఖ పొడవు: [25]

  1.  Kazakhstan - 1900 km
  2.  Turkmenistan - 1768 km
  3.  Azerbaijan - 1355 km
  4.  Russia - 820 km
  5.  ఇరాన్ - 657 km

అంకెల్లో కాస్పియన్ సముద్రం

[మార్చు]
  1. ఉపరితల వైశాల్యం: 3,71,000 చదరపు కిలోమీటర్లు
  2. గరిష్ట లోతు: 1,025 మీటర్లు
  3. సగటు లోతు: 211 మీ
  4. పొడవు: 1,030 కి.మీ.
  5. గరిష్ట వెడల్పు: 435 కి.మీ.
  6. కనిష్ట వెడల్పు: 200 కి.మీ.
  7. తీరరేఖ పొడవు: 6,820 కి.మీ.
  8. నీటి పరిమాణం: 78,200 క్యూబిక్ కి.మీ.
  9. ఎత్తు: సముద్ర మట్టానికి 22 మీ. దిగువ. కాస్పియన్ సముద్రపు ఉత్తర ప్రాంతాన్ని కలుపుతున్న చదునైన, లోతట్టు ప్రాంతమైన కాస్పియన్ డిప్రెషన్ భూమిపై అతత్యంత లోతైన పాయింట్లలో ఒకటి. [26]

కాస్పియన్ సముద్రం ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఉత్తరం నుండి దక్షిణానికి దీని పొడవు 1,174 కి.మీ. దీని సగటు వెడల్పు 326 కి.మీ. సరస్సు మధ్య భాగంలో లోతు 788 మీటర్లు ఉండగా దక్షిణ భాగంలో 1,025 మీటర్లుంటుంది. దీని నుండి బయటికి పోయే ప్రవాహం లేదు కాబట్టి నీటి ఉపరితల స్థాయి కొద్దిగా హెచ్చుతగ్గులకు లోనవుతూంటుంది; 2010 నాటికి సముద్ర మట్టానికి 25 మీ.దిగువన ఉంది. షెల్ఫ్ జోన్‌తో సహా 3,22,000 చ.కి.మీ..విస్తీర్ణం మాజీ సోవియట్ యూనియన్‌లో ఉండేది. 200 మీటర్ల లోతు వరకు వెళ్ళి చేపలు పట్టే వీలున్న విస్తీర్ణం 2,40,000 చ.కి.మీ.

చర్చలు

[మార్చు]

As of 2000, దాదాపు ఒక దశాబ్ద కాలంగా దాని సరిహద్దులో ఉన్న అన్ని దేశాల మధ్య సముద్ర సరిహద్దుల గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇది సముద్రమా, సరస్సా లేక రెండూ కలిసినదా అనే దన్ని బట్టి సరిహద్దు నియమాలు ఉంటాయి. వీటిపై భారీయెత్తున చర్చలు జరిగాయి. ఖనిజ వనరులకు (చమురు, సహజ వాయువు), చేపల వేటకు లభ్యత, అంతర్జాతీయ జలాలకు ప్రాప్యత (రష్యా లోని వోల్గా నది, నల్ల సముద్రం, బాల్టిక్ సముద్రానికి దాన్ని కలిపే కాలువల ద్వారా) వంటివి అన్నీ చర్చల ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. అజర్‌బైజాన్, కజాఖ్‌స్తాన్, తుర్క్‌మెనిస్తాన్‌లోని భూపరివేష్టిత దేశాల మార్కెట్ సామర్థ్యం, ఆర్థిక వైవిధ్యానికి వోల్గా నది అందుబాటులో ఉండడం కీలకం. దీనివలన ట్రాఫిక్ పెరిగిపోయి, అంతర్గత జలమార్గాల్లో కొన్ని పాయింట్లలో రద్దీ ఏర్పడే అవకాశం ఉండడంతో ఇది రష్యాకు ఆందోళన కలిగిస్తోంది. అది సముద్రం అయితే, అనేక అంతర్జాతీయ ఒప్పందాలు, పూర్వ సంప్రదాయాలను బట్టి అందులోకి విదేశీ నౌకలకు ఉచిత ప్రవేశం ఉంటుంది. అది ఒక సరస్సు అయితే అటువంటి కట్టుబాట్లు ఉండవు.

కాస్పియన్ సముద్రతీర దేశాలు ఐదింటికీ ఈ సముద్రంలో నావికా దళాలున్నాయి.

ఇరాన్, సోవియట్ యూనియన్ లు చేసుకున్న ఒప్పందం ప్రకారం, సముద్రం సాంకేతికంగా ఒక సరస్సు. దీన్ని రెండు విభాగాలుగా చేసారు (ఇరానియన్, సోవియట్). కానీ వనరులను మాత్రం (అప్పుడు ప్రధానంగా చేపలు ) ఉమ్మడిగా పంచుకుంటాయి. ఈ రెండు రంగాల మధ్య ఉన్న రేఖను సరస్సులో అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణిస్తాయి. సోవియట్ రంగం నాలుగు సముద్రతీర రిపబ్లిక్‌ల పరిపాలనా విభాగాలుగా ఉప-విభజన చేయబడింది.

రష్యా, కజకిస్తాన్, అజర్‌బైజాన్ దేశాలు తమతమ మధ్యస్థ రేఖల ఆధారంగా పరస్పరం ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నాయి. మూడు దేశాలు వాటిని ఉపయోగించడం వలన, మధ్యస్థ రేఖలు భవిష్యత్ ఒప్పందాలలో భూభాగాన్ని వివరించే పద్ధతిగా సంభావ్యత కనిపిస్తోంది. అయితే, ఇరాన్ మాత్రం ఐదు దేశాల మధ్య ఒకే, బహుపాక్షిక ఒప్పందం ఉండాలని (ఐదవ వంతు వాటా లక్ష్యంగా) పట్టుబట్టింది. సముద్రపు చమురు క్షేత్రాల విషయంలో అజర్‌బైజాన్ ఇరాన్‌తో విభేదిస్తోంది. అప్పుడప్పుడు, ఈ వివాదాస్పద ప్రాంతంలో అన్వేషణ కోసం అజర్‌బైజాన్ పంపిన నౌకలపై ఇరాన్ గస్తీ పడవలు కాల్పులు జరిపాయి. అజర్‌బైజాన్, తుర్క్‌మెనిస్తాన్‌ల మధ్య కూడా ఇలాంటివే ఉద్రిక్తతలు ఉన్నాయి (రెండు పక్షాలు పంచుకున్నట్లు గుర్తించబడిన క్షేత్రం నుండి అంగీకరించిన దానికంటే ఎక్కువ చమురును ఒకరు పంపు చేసుకున్నట్లు రెండో దేశం పేర్కొంది).

రవాణా

[మార్చు]

కాస్పియన్ సముద్రం ఎండోరిక్ సరస్సు అయినప్పటికీ, దాని ప్రధాన ఉపనది వోల్గా, ముఖ్యమైన షిప్పింగ్ కాలువల ద్వారా డాన్ నది (దాని ద్వారా నల్ల సముద్రం) బాల్టిక్ సముద్రంతో, ఉత్తర ద్వినా తెల్ల సముద్రం వరకు శాఖ కాలువలతో అనుసంధానించబడి ఉంది.

మరొక ఉపనది, కుమా నది, డాన్ బేసిన్‌తో నీటిపారుదల కాలువ ద్వారా అనుసంధానించబడి ఉంది.

సముద్రం మీదుగా షెడ్యూల్ చేయబడిన ఫెర్రీ సేవలు ( రైలు ఫెర్రీలతో సహా) ప్రధానంగా కింది ప్రదేశాల మధ్య నడుస్తున్నాయి:

  • తుర్క్‌మేనిస్తాన్ లోని తుర్క్‌మెన్‌బేసి (గతంలో క్రాస్నోవోడ్స్క్) బాకు ల మధ్య .
  • కజాఖ్స్తాన్ లోని అక్టౌ, బాకుల మధ్య
  • ఇరాన్, రష్యా నగరాల మధ్య.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 van der Leeden, Troise, and Todd, eds., The Water Encyclopedia. Second Edition. Chelsea F.C., MI: Lewis Publishers, 1990, p. 196.
  2. Wikisource link to https://en.wikipedia.org/wiki/Caspian_Sea#cite_note-3. వికీసోర్స్. 
  3. Wikisource link to https://en.wikipedia.org/wiki/Caspian_Sea#cite_note-4. వికీసోర్స్. 
  4. Wikisource link to https://en.wikipedia.org/wiki/Caspian_Sea#cite_note-5. వికీసోర్స్. 
  5. Wikisource link to https://en.wikipedia.org/wiki/Caspian_Sea#cite_note-7. వికీసోర్స్. 
  6. "Sea Facts". Casp Info. Archived from the original on 2017-02-26. Retrieved 2017-02-25.
  7. 7.0 7.1 "Caspian Sea – Background". Caspian Environment Programme. 2009. Archived from the original on 3 July 2013. Retrieved 11 September 2012.
  8. "Caspian Sea". Iran Gazette. Archived from the original on 2009-01-22. Retrieved 2010-05-17.
  9. 9.0 9.1 Hooshang Amirahmadi (2000). The Caspian Region at a Crossroad: Challenges of a New Frontier of Energy and Development. Palgrave Macmillan. pp. 112–. ISBN 978-0-312-22351-9. Archived from the original on 28 May 2013. Retrieved 20 May 2012.
  10. Khain V.E. Gadjiev A.N. Kengerli T.N. (2007). "Tectonic origin of the Apsheron Threshold in the Caspian Sea". Doklady Earth Sciences. 414 (1): 552–556. Bibcode:2007DokES.414..552K. doi:10.1134/S1028334X07040149.
  11. 11.0 11.1 Henri J. Dumont; Tamara A. Shiganova; Ulrich Niermann (2004). Aquatic Invasions in the Black, Caspian, and Mediterranean Seas. Springer. ISBN 978-1-4020-1869-5. Archived from the original on 28 May 2013. Retrieved 20 May 2012.
  12. A. G. Kostianoi and A. Kosarev (2005). The Caspian Sea Environment. Birkhäuser. ISBN 978-3-540-28281-5. Archived from the original on 28 May 2013. Retrieved 20 May 2012.
  13. "News Azerbaijan". ann.az. Archived from the original on 12 May 2013. Retrieved 9 October 2015.
  14. Naseka, A.M. and Bogutskaya, N.G. (2009). "Fishes of the Caspian Sea: zoogeography and updated check-list". Zoosystematica Rossica 18(2): 295–317.
  15. Geld, Bernard (April 9, 2002). "Caspian Oil and Gas: Production and Prospects" (PDF). wvvw.iwar.org.uk. Archived from the original (PDF) on December 6, 2018. Retrieved 2018-12-05.
  16. "LUKOIL starts up V. Filanovsky in the Caspian Sea". October 31, 2016. Archived from the original on November 3, 2016. Retrieved November 2, 2016.
  17. "Volume of oil tanker transportation in Caspian Sea to increase". AzerNews.az (in ఇంగ్లీష్). 2018-05-01. Archived from the original on 2018-12-06. Retrieved 2018-12-05.
  18. "The Great Gas Game Archived 2007-06-08 at the Wayback Machine", Christian Science Monitor (2001-10-25)
  19. 19.0 19.1 Sergei Blagov, "Russia Tries to Scuttle Proposed Trans-Caspian Pipeline Archived 2007-06-10 at the Wayback Machine", Eurasianet (2006-03-27)
  20. "Russia Seeking To Keep Kazakhstan Happy Archived 2008-05-12 at the Wayback Machine", Eurasianet (2007-12-10)
  21. Tim Webb (2010-12-15). "WikiLeaks cables: BP suffered blowout on Azerbaijan gas platform". The Guardian. London. Archived from the original on 2010-12-16. Retrieved 2013-03-26.
  22. Walt, Vivienne (2010-12-18). "WikiLeaks Reveals BP's 'Other' Offshore Drilling Disaster". Time. Archived from the original on 2013-03-25. Retrieved 2013-03-26.
  23. https://gsaz.az/en/articles/view/105/Characteristics-of-Caspian-Sea
  24. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-03-22. Retrieved 2021-11-23.
  25. https://www.isna.ir/news/97052211612/%D8%B3%D9%87%D9%85-%D9%88%D8%A7%D9%82%D8%B9%DB%8C-%D8%A7%DB%8C%D8%B1%D8%A7%D9%86-%D8%A7%D8%B2-%D8%AE%D8%B2%D8%B1-%DA%86%D9%82%D8%AF%D8%B1-%D8%A7%D8%B3%D8%AA
  26. https://www.livescience.com/57999-caspian-sea-facts.html