iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: https://te.wikipedia.org/wiki/ఈత_(వ్యాయామం)
ఈత (వ్యాయామం) - వికీపీడియా Jump to content

ఈత (వ్యాయామం)

వికీపీడియా నుండి
A swimmer performing front crawl
Competitive open water swimming race
Professional swimmers performing a water ballet in Guardalavaca, Cuba
A Styrofoam flotation aid being used.

ఈత ఒక రకమైన వ్యాయామం, క్రీడ. దీని వల్ల బహుళ ప్రయోజనాలున్నాయి. ఈత ఒంటికి మంచి వ్యాయామాన్నిస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈతాడుతూ స్నానం చేయవచ్చు. ఆటలు ఆడవచ్చు, చేపలు పట్టవచ్చు, ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణించవచ్చు. ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోతే ఆత్మ రక్షణ చేసుకోవచ్చు. చేపలు మొదలైన చాలా జలచరాలు నీటిలో ఈదగలుగుతే, మనుషులు ఈత నేర్చుకోవలసివుంటుంది.[1][2][3][4][5][6]

చరిత్ర

[మార్చు]

ఈతను గురించిన ప్రస్తావన చరిత్ర పూర్వం నుంచే ఉంది. 7000 సంవత్సరాల క్రితం రాతియుగానికి చెందిన కాలానికి చెందిన చిత్రకళ ద్వారా దీనిని మొట్టమొదటగా రికార్డు చేశారు. 1896 లో ఏథెన్స్లో జరిగిన మొట్టమొదటి ఒలంపిక్ పోటీల్లో ఈత పోటీలు కూడా ఒక భాగం.

పురాతన కాలంలో

[మార్చు]

ఈత గూర్చి 10,000 ఏళ్ల క్రితం నైరుతి ఈజిప్ట్ లో సుర సమీపంలోని గుహలపై ఈతగాళ్ళ రాతిపై గీసిన చిత్రాలు ఆధారంగా తెలుస్తుంది. అయితే ఈ చిత్రాలను బట్టి ఈ ఈత అనేది బ్యాక్‌స్ట్రోక్ అనిపిస్తోంది . ఈత అనేది "బ్యాక్‌స్ట్రోక్" నుండి రూపాంతరం చెందిందని బాస్-రిలీఫ్, "అస్సీరియ" లలోని గోడచిత్రాలనుబట్టి, బాలిలోనియాలో చిత్రాలను బట్టి కూడా తెలుస్తుంది. 2000 BCE నుండి ఈజిప్షియన్ సమాధి ముందు క్రాల్ యొక్క రూపాంతరం చూపిస్తుంది .

ఈత శైలులు

[మార్చు]

స్విమ్మింగ్ లో నాలుగు ప్రముఖ శైలులు ఏర్పాటు చేశారు. ఈ స్ట్రోక్స్ గత 30-40 సంవత్సరాలుగా స్థిరంగా ఉన్నాయి.స్విమ్మింగ్ లో నాలుగు ప్రధాన స్ట్రోక్స్ ఉన్నాయి:

  1. ఫ్రీస్టైల్ (ఉచిత)
  2. బ్రెస్ట్ స్ట్రోక్ (రొమ్ము)
  3. బాక్ (తిరిగి)
  4. బటర్ (ఫ్లై)

ఈత కొలనులలోనూ, నదులలనూ, దిగుడు బావులలోనూ మొదలైన వాటిలో ఈతను కొడాతారు. గజ ఈత గాళ్ళు

ఒక పోటీ క్రీడగా ఈత చరిత్ర

[మార్చు]
  • స్విమ్మింగ్ ఇంగ్లాండ్ లో 1830 లో ఒక పోటీ క్రీడగా ఉద్భవించింది. 1828 లో, మొదటి అంతర్గత ఈత పూల్ ప్రారంభించారు.
  • 1837 నాటికి, నేషనల్ స్విమ్మింగ్ సమాజం లండన్ చుట్టూ నిర్మించిన ఆరు కృత్రిమ ఈత కొలనులు, సాధారణ స్విమ్మింగ్ పోటీల్లో ప్రజాదరణ పెరిగింది.
  • 1880 లో జాతీయ పాలక ఔత్సాహిక ఈత సంఘం ఏర్పడింది.
  • 1844 లో ఒక స్విమ్మింగ్ పోటీ రెండు స్థానిక అమెరికన్ల యొక్క భాగస్వామ్యంతో లండన్ లో జరిగింది .
  • బ్రిటిష్ 1873 వరకు మాత్రమే బ్రెస్ట్స్ట్రోక్ ఈత కొనసాగింది
  • 1901 నుండి బ్రెస్ట్స్ట్రోక్ తొ పాటు మీగత స్ట్స్ట్రోక్స్ ప్రచుర్యంలోకి వచ్చినవి.

ఈత పోటీలు

[మార్చు]

ఈత పోటీల్లో ప్రధానంగా జరిగేవి వేగానికి సంబంధించినవి. ఈ పోటీల్లో ఒక కచ్చితమైన దూరాన్ని ఎవరు ముందుగా ఈదగలరో వారు గెలిచినట్లు లెక్క. ఈ పోటీలు 19 వశతాబ్దంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ పోటీల్లో 36 విభాగాలుంటాయి. వీటిలో 18 పురుషుల కోసం, 18 స్త్రీల కోసం నిర్వహించబడతాయి. మొదటి నాలుగు ఒలంపిక్ పోటీల్లో ఈత పోటీలను ఈతకొలనుల్లో నిర్వహించలేదు. ఓపెన్ గా ఉన్న సముద్ర జలాల్లో నిర్వహించే వారు.

వృత్తి

[మార్చు]

చేపలు పట్టే వారు, ముత్యాల కోసం సముద్ర గర్భంలో అన్వేషించే వారు ఈతను తమ వృత్తిగా స్వీకరిస్తారు. ఈతలో అంత అనుభవం లేని కొందరు ప్రమాదంలో ఉంటే గజ ఈత గాళ్ళు వారిని రక్షిస్తారు. వీరికి కూడా ఈత ప్రధాన వృత్తే. అమెరికాలో చాలా నగరాల్లో ఇలాంటి ప్రమాదాలనుంచి రక్షించడానికి సుశిక్షితులైన గజ ఈతగాళ్ళ బృందాలు ఉంటాయి. ఉదాహరణకు లాస్ ఏంజిలస్ నగరంలో లాస్ ఏంజిలస్ లైఫ్ గార్డ్స్ అనే బృందం.

అపాయాలు

[మార్చు]

ఈతలో సాధారణంగా ఎక్కువ అపాయమైనది నీళ్ళలో మునిగిపోవడం. ఎక్కువగా నీళ్ళు తాగడం వలన కడుపు ఉబ్బి శ్వాస ఆడక చనిపోవడం జరుగుతుంది. సాధారణంగా పల్లెటూర్లలో చెరువుల్లో ఈత ఆడడానికి వెళుతుంటారు. అలాంటప్పుడు చెరువుల్లోని బురుద కుంటల్లో (ఊబి). కూరుకు పోయి ఈత తెలిసిన వారు కూడా ప్రాణాలు కోల్పేయే అవకాశం ఉంది.

నదుల్లో ఈదేటప్పుడు ప్రవాహం వేగం ఎక్కువైతే కూడా కొట్టుకుపొయే ప్రమాదం ఉంది.

వస్త్రధారణ

[మార్చు]

సాధారణంగా మనం వాడే దుస్తులు ఈతకు అంత సౌకర్యంగా ఉండవు. అంత సురక్షితమైనవి కూడా కావు. అందుకనే ప్రస్తుతం ఈత కోసం ఇప్పుడు ప్రత్యేక దుస్తులు వాడుతున్నారు. ఇవి శరీరానికి అతుక్కొని, నీరు పీల్చుకొనేటట్టుగా ఉంటాయి.

ఒలింపిక్ లో ఈత

[మార్చు]
  • ఒలింపిక్ గేమ్స్ ఏథెన్స్, పురుషులకు మాత్రమే పోటీలో 1896 లో జరిగాయి .
  • ఆరు ఈవెంట్స్ స్విమ్మింగ్ పోటీ కోసం ప్రణాళిక చేశారు, కానీ నాలుగే నిజానికి పోటీ జరిగింది : 100 m, 500 m,, 1200 m ఫ్రీస్టైల్, నావికులు 100 m .
  • 1900 లో పారిస్ లో రెండవ ఒలింపిక్ గేమ్స్ 200m, 1000m,, 4000m ఫ్రీస్టైల్, 200m బాక్ స్ట్రోక్,, ఒక 200m జట్టు రేసుప్రదర్శించారు.
  • రెండు అదనపు అసాధారణ ఈత ఈవెంట్స్ ఉన్నాయి : సీన్ నదిలో కోర్సు ఈత ఒక అడ్డంకి ( ప్రస్తుత ఈత ),, ఒక నీటి అడుగున ఈత రేసు . 10 కే మారథాన్ ఈత 2008 లో ప్రవేశపెట్టారు.
  • పొడవైన ఒలింపిక్ ఈత రేసు కిందలో జాన్ ఆర్థర్ జార్విస్ గెలుపొందింది .
  • వాటర్ పోలో వంటి బాక్ స్ట్రోక్ కూడా, పారిస్ లో ఒలింపిక్ గేమ్స్ పరిచయం చేశారు .
  • 1908 లో, ప్రపంచ ఈత సంఘం ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి అమెచ్యూర్ (FINA) ఏర్పడింది.

మూలాలు

[మార్చు]
  1. "ప్రాణం తీసిన ఈత సరదా". Sakshi. 2024-04-17. Retrieved 2024-04-18.
  2. "సరదా అనుకోకు.. ప్రాణాల మీదకు తెచ్చుకోకు". EENADU. Retrieved 2024-04-18.
  3. Bharat, E. T. V. (2024-04-17). "చెరువుల్లో స్విమ్మింగ్​కు వెళ్తున్నారా? - ఈ టిప్స్ పాటించకపోతే మీ ప్రాణాలకే డేంజర్! - Safety Tips For Swimming in Telugu". ETV Bharat News. Retrieved 2024-04-18. {{cite web}}: zero width space character in |title= at position 23 (help)
  4. "ఈత సరదాలో ప్రాణాలు కోల్పోయేవాడిని". EENADU. Retrieved 2024-04-18.
  5. "ఈత.. మృత్యువాత". Sakshi. 2024-04-12. Retrieved 2024-04-18.
  6. telugu, NT News (2024-03-27). "ఈత.. గుండెకోత". www.ntnews.com. Retrieved 2024-04-18.

ఇతర లింకులు

[మార్చు]