1857
Appearance
1857 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1854 1855 1856 - 1857 - 1858 1859 1860 |
దశాబ్దాలు: | 1830లు 1840లు - 1850లు - 1860లు 1870లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 24: కలకత్తా విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
- మార్చి 4: జేమ్స్ బుకానన్, 15వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం.
- మే 10: మీరట్లో సిపాయీల తిరుగుబాటు ప్రారంభమై మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధంగా పరిణమించింది.
- జూలై 17: తుర్రేబాజ్ ఖాన్ బ్రిటీష్ ఆధిపత్యానికి నిలయమైన హైదరాబాద్ రెసిడెన్సీ విూద దాడి చేశాడు.
- జూలై 22: తుర్రేబాజ్ ఖాన్ బ్రిటీష్-నిజాం బలగాలకు పట్టుబడ్డాడు.
- అక్టోబర్ 4: " బాటిల్ ఆఫ్ ఛత్రా " పేరుతో యుద్ధం " ఫంసీ తలాబ్ " వద్ద జరిగింది. ఒక గంట కాలం యుద్ధం జరిగిన తరువాత గిరిజనులు పూర్తిగా ఓడించబడ్డారు. ఈ యుద్ధంలో 56 యురేపియన్ సైనికులు, సైనిక అధికారులు మరణించారు. అలాగే 150 తిరుగుబాటుదార్లు మరణించారు, 77 మంది గుంటలో పూడ్చిపెట్టబడ్డారు.
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- లీయాన్ ఫోకాల్ట్ తనపేరుతో ప్రసిద్ధిచెందిన కాంతి తలీకరణ యంత్రాన్ని (పోలరైజర్) ను కనుగొన్నాడు.
జననాలు
[మార్చు]- ఫిబ్రవరి 22: హెన్రిచ్ రుడాఫ్ హెర్జ్, విద్యుదయస్కాంత వికిరణాలను ఉత్పత్తి చేయడం, శోధించే ప్రక్రియలను కనుగొన్న శాస్త్రవేత్త. (మ.1894)
- మార్చి 27: కార్ల్ పియర్సన్, ఇంగ్లీషు గణిత శాస్త్రవేత్త. (మ.1936)
- మే 13: రోనాల్డ్ రాస్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1932)
- జూలై 14: మేటాగ్, వాషింగ్ మెషిన్ (బట్టలు ఉతికే యంత్రం) ని కనిపెట్టిన శాస్త్రవేత్త.
- సెప్టెంబర్ 16: కల్లూరి వేంకట రామశాస్త్రి, తెలుగు కవి. వీరి కీర్తి జ్యోతిని శాశ్వతస్థితిలో ప్రకాశింపజేయు రచన బాలవ్యాకరణ గుప్తార్థ ప్రకాశిక. (జ.1857)
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- ఈడిత్ బోర్డ్మాన్, హైదరాబాదుకు చెందిన ఆంగ్లో ఇండియన్ వైద్యురాలు. ఆంగ్లంలో నవల వ్రాసిన తొలి భారతీయ మహిళ.
- మిర్జా హాది రుస్వా, ఉర్దూ కవి, పండితుడు. (మ.1931)
- రాళ్ళభండి నృసింహశాస్త్రి, అష్టావధాని. (మ.1942) [1]
మరణాలు
[మార్చు]- మార్చి 13: విలియం అమ్హెర్స్ట్, చైనా బ్రిటిష్ రాయబారి, భారత గవర్నర్ జనరల్. (జ.1773)
- ఏప్రిల్ 8: మంగళ్ పాండే, సిపాయిల తిరుగుబాటు ప్రారంభకులలో ఒకడు. (జ.1827)
- మే 16: నాసిర్ ఉద్దౌలా ఫర్ఖుందా అలీ అసఫ్ ఝా IV, నిజాం నవాబు. (జ.1794)
- జూన్ 30: గులాబ్ సింగ్, జమ్మూ-కాశ్మీరు రాజ్యానికి తొలి మహారాజు. (జ.1792)
- అక్టోబర్ 9: జోసెఫ్ రెస్సెల్, జర్మన్-బోహేమియన్ ఆవిష్కర్త. (జ.1793)
- సెప్టెంబర్ 19: శంకర్ షా, గోండ్వానా సామ్రాజ్యానికి చెందిన రాజు. స్వాతంత్ర్య పోరాటవీరుడు.
- డిసెంబర్ 3: క్రిస్టియన్ డేనియల్ రౌచ్, జర్మన్ శిల్పి. (జ.1777)
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 116.