iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: http://te.wikipedia.org/wiki/కిషోర్_గౌడ్
కిషోర్ గౌడ్ - వికీపీడియా Jump to content

కిషోర్ గౌడ్

వికీపీడియా నుండి
కె. కిషోర్ గౌడ్
కిషోర్ గౌడ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 ఆగష్టు 2021 - 31 ఆగస్ట్ 2024
ముందు ఆంజనేయ గౌడ్

వ్యక్తిగత వివరాలు

జననం 5 ఆగష్టు 1986
గొట్టిపర్తి గ్రామం, తుంగతుర్తి మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు కె. రాములు, కె.భాగ్యమ్మ
జీవిత భాగస్వామి ప్రత్యుష
సంతానం 1
నివాసం అంబర్‌పేట , హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు, రచయిత

కోతి కిషోర్ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన భారత్ రాష్ట్ర సమితి అనుబంధ సంఘం టీఆర్‌ఎస్వీలో వివిధ హోదాల్లో పనిచేశాడు. కిషోర్ గౌడ్ 2021, ఆగస్టు 23న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడిగా నియమితుడయ్యాడు.[1] ఆయన సామజిక, విద్య వ్యవస్థలపై పలు పత్రికల్లో వ్యాసాలు రాస్తాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

కిషోర్ గౌడ్ 1986, ఆగస్టు 5న తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండలం, గొట్టిపర్తి గ్రామంలో కె. రాములు, కె.భాగ్యమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఎస్సీ. బి.ఈ.డి పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కిషోర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004 నుండి 2006 వరకు దిల్‌సుఖ్‌నగర్‌ జోన్‌ ప్రధాన కార్యదర్శిగా, 2006 నుండి 2010 వరకు టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శిగా, అంబర్‌పేట్ నియోజకవర్గం ఇంచార్జ్ గా, 2010 నుండి 2016 వరకు టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేశాడు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేప్పట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సభ్యుడిగా ఉన్నాడు.[3] కిషోర్ గౌడ్ ను 2021 ఆగస్టు 23న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2021 సెప్టెంబరు 1న ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేపట్టాడు.[4]

ఉద్యమ జీవితం

[మార్చు]

కిషోర్ గౌడ్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశాడు. ఆయన పై ఉద్యమ సమయంలో వివిధ పోలీస్‌ స్టేషన్లలో 50 వరకు కేసులు నమోదయ్యాయి.

మూలాలు

[మార్చు]
  1. V6 Velugu (23 August 2021). "తెలంగాణ బీసీ కమిషన్ ఏర్పాటు" (in ఇంగ్లీష్). Archived from the original on 26 August 2021. Retrieved 26 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Namasthe Telangana (7 March 2022). "విద్యతోనే సమగ్రాభివృద్ధి". Archived from the original on 8 March 2022. Retrieved 8 March 2022.
  3. Andrajyothy (24 August 2021). "బీసీ కమిషన్‌ చైర్మన్‌గా వకుళాభరణం". Archived from the original on 26 August 2021. Retrieved 26 August 2021.
  4. Namasthe Telangana (1 September 2021). "తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ పదవీ బాధ్యతల స్వీకరణ". Archived from the original on 1 September 2021. Retrieved 1 September 2021.