iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: http://te.m.wikipedia.org/wiki/వికీపీడియా:గురించి
వికీపీడియా:గురించి - వికీపీడియా
వికీపీడియా.ఆర్గ్

వికీపీడియా అనేది ఈ ప్రపంచం లోని ప్రజలందరూ కలసికట్టుగా వ్రాసే ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఈ సైటు ఒక వికీ! అంటే, సవరించు అనే లంకె (LINK) ను నొక్కి ఎవరైనా వ్యాసాలను సరిదిద్దవచ్చు.

వికీపీడియా అనేది వికీమీడియా ఫౌండేషన్‌ ఇన్‌కార్పొరేటెడ్‌ వారి ట్రేడ్‌మార్క్‌

చరిత్ర

జిమ్మీ వేల్స్, లారీ సాంగర్ లు కొంత మంది ఔత్సాహికులతో కలిసి 2001, జనవరి 15 న వికీమీడియాను స్థాపించారు. మూడేళ్ళ తరువాత, 2004 డిసెంబరు నాటికి 100 కు పైగా భాషలలో 1,800,000 కు మించిన వ్యాసములపై13,000 కి పైగా సమర్పకులు చురుకుగా పనిచేస్తున్నారు. ఈనాటికి తెలుగులో 1,01,527 వ్యాసములున్నాయి; ప్రతిరోజూ ప్రపంచమంతటి నుండీ వందల వేల మంది కొన్ని వందల సంఖ్యలో వ్యాసాలను సరిదిద్దుతూ, పదుల సంఖ్యలో కొత్త వ్యాసాలను రాస్తూ, ఈ విజ్ఞాన సర్వస్వం లోని విజ్ఞానాన్ని మెరుగుపరుస్తూ వుంటారు.

వికీపీడియా లోనున్న వ్యాసములు, చిత్రవిశేషాలూ, ఇతర విషయాలు జి.ఎన్.యు. ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్స్ (GNU ఉచిత భావవ్యక్తీకరణ లైసెన్సు (GFDL) కు లోబడి వుంటాయి. ఈ వ్యాసాలన్నీ వాటి సమర్పకుల ఆస్తి గానే వుంటాయి, కానీ వీటి ఉచితంగా పంపిణీకి, తిరిగి వాడుకోవటానికి ఈ లైసెన్సు వీలు కలిగిస్తుంది. (మరింత సమాచారం కొరకు కాపీహక్కు గమనిక మరియు అస్వీకార ప్రకటన లను చూడండి)

వికీపీడియా శోధన

సందర్శకులు ఈ సైటుకు రావటానికి ప్రధాన కారణం విజ్ఞాన సముపార్జన. రెండో కారణం విజ్ఞానాన్ని పంచుకోవటం. మీరు ఇది చదువుతున్న ఈ క్షణాన ఎన్నో వ్యాసాలు మెరుగు పడుతున్నాయి. ఏమేమి మార్పులు జరుగుతున్నాయో ఇటీవలి మార్పులు పేజిలో చూడవచ్చు. కొత్త వ్యాసాలు కూడా చేరుతున్నాయి.

ఇంకా వికీపీడియాలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఏ సభ్యుడైనా ఇతరులకు ఉపయోగపడే సమాచారాన్ని ఇవ్వాలని ఆశిస్తాం. ప్రాజెక్టులు అందరి పనినీ సమన్వయపరుస్తాయి. వ్యాసాలు ఎక్కువగా మొలకలు గా మొదలై, చాలా సమర్పణల తరువాత విశేష వ్యాసాలు గా ముగియ వచ్చు.

మీరు వెదుకుతున్న సమాచారం వికీపీడియాలో దొరకకుంటే, వ్యాసం కావాలని అడగండి లేదా సహాయ కేంద్రం లో ప్రశ్నించండి. మీరు యాదృచ్ఛిక వ్యాసం చూడవచ్చు.

వికీపీడియాలో రచనలు చెయ్యడం

వ్యాసం లోని మార్చు లంకెను నొక్కి వికీపీడియాకు ఎవరైనా సమర్పణలు చెయ్యవచ్చు. అయితే, సమర్పించే ముందు, పాఠం, విధానాలూ మార్గదర్శకాలు మరియు స్వాగతం పేజీ లను తప్పక చూడాలి.

వికీపీడియా వెనుక

వికీపీడియా మీడియావికీ అనే ఓపెన్ సోర్సు సాఫ్ట్​వేర్ ను వాడుతుంది. అన్ని వికీమీడియా ప్రాజెక్టుల్లోను దీనిని వాడతారు. ఈ ప్రాజెక్టులన్నీ ప్రపంచ వ్యాప్తంగా నున్న 100 సర్వర్లలో పనిచేస్తూ ఉంటాయి. సర్వర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ మెటా పేజీ లో దొరుకుతాయి.

వికీపీడియా సాంకేతిక వివరాల కొరకు సాంకేతిక ప్రశ్నలు చూడండి.

ప్రాజెక్టు సభ్యులను ఎలా సంప్రదించాలి

మరింత సమాచారం కావాలంటే ముందుగా చూడవలసినది సహాయము:సూచిక పేజీ. సభ్యులతో మాట్లాడాలంటే వారి చర్చాపేజీలో సందేశం పెట్టండి. విధాన పరమైన, ప్రాజెక్టుకు సంబంధించిన ప్రశ్నలు సాధారణంగా రచ్చబండ వద్ద, ఆన్‌లైనులో, వికీపీడియా మెయిలింగు లిస్టులు, ఈ-మెయిలు ద్వారా అడగాలి. వికీపీడియన్లను ఇంకా IRC మరియు తక్షణ సందేశం ద్వారానూ కలవవచ్చు.

ఇంకా వివిధ ప్రాజెక్టులను సమన్వయ పరచే meta-Wikipedia వంటి ఎన్నో చోట్ల తప్పుల నివేదికలు, వ్యాసాలకు వినతులు సమర్పించవచ్చు.

పూర్తి వివరాల జాబితా కొరకు చూడండి: సముదాయ పందిరి.

ఇతర లంకెలు


సోదర ప్రాజెక్టులు

సోదర ప్రాజెక్టులు
 
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
 
వికీసోర్స్ 
మూలాలు 
 
వికీడేటా 
వికీడేటా 
 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
 
విక్షనరీ 
శబ్దకోశం 
 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం